‘మారుతి’ని చావుదెబ్బ కొడుతున్న బుల్లికారు ‘క్విడ్’!

హైదరాబాద్: దశాబ్దాలుగా భారత్‌లో కార్ల అమ్మకాలలో నంబర్ 1 స్థానంలో ఉన్న మారుతిసంస్థను రెండు నెలలైనా నిండని పసిగుడ్డులాంటి ఒక బుల్లికారు దిమ్మతిరిగిపోయేలా దెబ్బకొడుతోంది. భారత చిన్నకార్ల మార్కెట్‌లో మారుతి రారాజన్న విషయం తెలిసిందే. వారి మారుతి 800, ఆల్టో 800, ఆల్టో కే10 కార్లు ఎన్ని విదేశీ బ్రాండ్‌లొచ్చినా అప్రతిహతంగా ముందంజలో కొనసాగుతున్నాయి. అలాంటి మారుతికి ఫ్రెంచ్ కంపెనీ ‘రెనో’ షాక్ ఇచ్చింది. గత నెలలో లాంచ్ అయిన రెనో క్విడ్ మొదటిరోజునుంచే సూపర్ సక్సెస్ అయింది.

ఫ్రెంచ్ కంపెనీ రెనో, జపాన్ కంపెనీ నిస్సాన్ కలిసి క్విడ్‌ను మూడేళ్ళు కష్టపడి డిజైన్ చేశాయి. ఇది ఒక బుల్లి ఎస్‌యూవీ లాగా కనిపించే హేచ్‌బ్యాక్. ముందునుంచి చూస్తే రెనో వారి సక్సెస్‌ఫుల్ మోడల్ డస్టర్‌లాగా ఉంటుంది. 800 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందించిన ఈ కారును కేవలం ఇండియన్ మార్కెట్ కోసమే తయారు చేశారు. ప్రత్యర్థి కంపెనీలకంటే సరసమైన ధరకే అందించాలనే ఉద్దేశ్యంతో ఎంట్రీ మోడల్ రేటును రు.2.56 లక్షలుగా నిర్ణయించారు. లోపలి ఫీచర్స్ అన్నీ హైఎండ్ కార్‌లలో ఉండేవి అందించారు. లోపలి స్పేస్ మిగిలిన చిన్న కార్లన్నింటికంటే ఎక్కువ ఉండటం దీని మరో ప్రత్యేకత.

ఇన్ని ప్రత్యేకతలుండటంవలనే క్విడ్ మొదటిరోజునుంచే విజయవంతమైపోయింది. మొదటి రెండువారాలలోనే దేశవ్యాప్తంగా 25,000 బుకింగ్‌లు జరిగాయి. నెలరోజుల తర్వాత చూస్తే, ఇప్పుడు ఆరునెలల వెయిటింగ్ పీరియడ్ ఏర్పడింది. క్విడ్ మారుతి ఆల్టో, హ్యూండాయ్ ఇయాన్ మోడల్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఆదరణతో ఉత్సాహంలో ఉన్న క్విడ్ తయారీదారులు 1 లీటర్ పెట్రోల్, ఆటోమేటిక్ వంటి మరిన్ని వేరియంట్స్‌ను తీసుకురావాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close