డ్ర‌గ్స్ మ‌త్తులో చిక్కుకొన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రు?

అప్ప‌ట్లో సినిమావాళ్ల‌ని టార్గెట్ చేసి హ‌డావుడి చేసిన సిట్ ఎంక్వైరీ.. చప్పున చ‌ల్లారిపోయింది. 11మందిని విచారించిన అనంత‌రం ఏం తేల్చారో, ఏం సాధించారో ఎవ్వ‌రూ చెప్ప‌లేదు. ఇక సిట్ విచారణ ప‌క్క‌కు వెళ్లిపోయింది.. ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగి పోయింద‌ని అంతా లైట్ తీసుకొన్నారు. అయితే సిట్ అధికారులు మాత్రం గ‌ప్ చుప్‌గా త‌మ ప‌ని తాము చేసుకొంటూ వెళ్తునార‌ట‌. ఈ 11 మంది ఇచ్చిన వాంగ్మూలం.. మ‌రో మూడు కొత్త పేర్ల‌ను వెలికి తీసుకొచ్చాయ‌ని తెలుస్తోంది. అందులో ఓ అగ్ర క‌థానాయిక కూడా ఉంద‌ని స‌మాచారం. టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా చ‌లామ‌ణీ అవుతున్న ఓ ముద్దుగుమ్మ డ్ర‌గ్స్ మ‌త్తులో పూర్తిగా కూరుకుపోయింద‌ట‌. ఆమెకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా సిట్ వ‌ద్ద ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఓ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకొని, అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌నంత మ‌త్తులో కూరుకుపోయిన ఓ వీడియో సిట్ వాళ్ల‌కు ల‌భ్యమైంద‌ట‌. సిట్ త‌దుప‌రి టార్గెట్ ఆ క‌థానాయిక అని తేలిసింది.

వీళ్ల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌కే పెద్ద దిక్క‌యిన రెండు కుటుంబాలకు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై కూడా సిట్ నిఘా పెట్టిన‌ట్టు తేలిసింది. అతి త్వ‌రలో వీళ్ల‌కు నోటీసులు అందే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. అయితే ఈసారి విచార‌ణ గ‌ప్ చుప్‌గా సాగించాలా, లేదంటే మీడియాకు తెలిసేలా చేయాలా అనే విష‌యం సిట్ ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ విచారించిన 11మందిలో ఇద్ద‌రినీ మ‌రోసారి విచార‌ణ‌కు పిల‌వాల‌ని, ఈ న‌లుగురినీ ఒక‌రి త‌ర‌వాత ఒక‌రిగా విచారించాల‌ని సిట్ భావిస్తోంద‌ట‌. డ్ర‌గ్స్ మ‌కిలి ఇంకా టాలీవుడ్‌ని వ‌ద‌ల్లేద‌న్న‌ది వాస్త‌వం. సిట్ కూడా టాలీవుడ్‌ని వ‌ద‌ల్లేదు. ఈ కంపు.. మ‌రోసారి టాలీవుడ్ అంత‌టా వ్యాపించ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com