వెంకీ మిస్స‌య్యాడు… నాగ్ దొరుకుతాడా ?

కొత్త క‌థ‌లు రావు, కొత్త త‌ర‌హా సినిమాలు రావు అని మ‌నోళ్లు తెగ బాధ‌ప‌డిపోతుంటారు గానీ.. అలా వ‌చ్చిన‌ప్పుడు అద‌రించిందెవ‌రు?? ఓ మంచి క‌థ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యి ఇమేజ్‌ని ప‌క్క‌న పెట్టిందెప్పుడు?? చంద్ర‌శేఖ‌ర్ యేలేటి విష‌యంలో అదే జ‌రిగింది. మ‌న‌మంతా అనే ఓ మంచి సినిమా తీశారాయ‌న‌. చూసిన‌వాళ్లంతా ‘ఇలాంటి సినిమాలు అరుదుగా వ‌స్తాయి’ అని కితాబులు ఇస్తున్నారు. కానీ… ఆ సినిమాకి తెగ‌ని టికెట్లెన్ని?? ఈ క‌థ‌ని మోహ‌న్‌లాల్ కాకుండా ఏ వెంక‌టేష్‌లాంటి హీరోనో చేసుంటే ఈ సినిమా రేంజే వేరుగా ఉంటుంది అంటున్నారంతా. అయితే చందూ ఆ ప్ర‌య‌త్నం కూడా చేసేశాడు. ఈ క‌థ ముందు వినిపించింది వెంకీకే. కానీ రెండేళ్లు తిప్పుకొన్న వెంకీ చివ‌రికి హ్యాండిచ్చాడు.

మ‌న‌మంతా చూశాక రాజ‌మౌళి లాంటి వాడే షాక్ అయ్యాడు. ఈ సినిమాపై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపించాడు. ఇప్పుడు చందూపై మిగిలిన హీరోల‌కు న‌మ్మ‌కం వ‌చ్చుంటుంది. ఆన‌మ్మ‌కంతోనే నాగార్జున‌కు ఓ క‌థ చెప్ప‌డానికి సిద్ద‌మ‌య్యాడు చందూ. నాగ్ కూడా కొత్త క‌థ‌ల‌ను ముందు నుంచీ ప్రోత్స‌హిస్తున్న‌వాడే. మ‌రి.. నాగ్‌ని చందూ ఒప్పించ‌డ‌ల‌డా?? అప్ప‌ట్లో వెంకీ మిస్స‌య్యాడు. ఇప్పుడు నాగార్జున‌నైనా ప‌ట్టేస్తాడా? వారం ప‌ది రోజుల్లో నాగార్జున – చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్ పై ఓ స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com