అయ్యోపాపం: పోరు దండగే… జిహ్వాయాసం తప్ప!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎపిసోడ్‌ను గమనిస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఎంత కీలకమైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. సమీకరణాలు కుదరక ఎమ్మెల్యే కాలేకపోయిన రోజా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత.. తెదేపా దిగ్గజాన్ని ఓడించి తాను కోరుకున్న సీటునుంచి మొత్తానికి ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. ఆ పదవిలోని ఆనందం, హోదా ఆమెకు పూర్తిస్థాయిలో దక్కకుండా పోయింది. పదవి దక్కిన రెండో ఏడాదిలోనే.. ఏడాది పాటు సస్పెన్షన్‌.. అది కూడా జీతం బత్తెం లేకుండా… అంటే అది సామాన్యమైన విషయం ఎంతమాత్రమూ కాదు. కనీసం తాను ఎమ్మెల్యేను అని తన ప్రజలు గుర్తించేలాగా శాసనసభలో ప్రవేశించి అరచి, మాట్లాడి గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఈ ఏడాదిపాటు వీల్లేదు. మహా అయితే కోర్టు ఖర్చులకు అయిన వ్యయాన్ని తాను సాయంగా అందించి.. ఆమెను ఆర్థికంగా ఆదుకుని ఉండవచ్చు గాక.. కానీ పోరాటం ద్వారా ఆమె అటు ప్రభుత్వం మీద ఎలాంటి విజయాన్ని సాధించలేకపోయారు. పార్టీలో ఎలాంటి హోదాలను కొత్తగా దక్కించుకోలేకపోయారు. మరీ దయనీయమైన విషయం ఏంటంటే.. తాను వ్యవహరించిన తీరుకు తన సొంత పార్టీలోని సహచర ఎమ్మెల్యేల సానుభూతిని కూడా వాస్తవంగా ఆమె సంపాదించుకోలేకపోయారు!
రోజాకు మిగిలినదెల్లా జిహ్వాయాసం మాత్రమే. అంటే నాలు ఆయాసం. అరచి అరచి.. అధికార పక్షాన్ని, చంద్రబాబునాయుడుని అతి భయంకరంగా తూలనాడి ఆమె నాలుక చాలా అలసిపోయి ఉండవచ్చు. ఆ విధముగా నాలుకకు కలిగిన జిహ్వాయాసం తప్ప.. ఏడాదిపాటు సస్పెన్షన్‌, తదనంతర పరిణామాల్లో ముమ్మరంగా సాగించిన పోరాటం ద్వారా ఆమెకు జిహ్వాయాసం మాత్రం దక్కింది.
అసలే రోజా ప్రభుత్వం మీద దాడికి పూనుకోవడంలో తన నాలుకకు చాలా శ్రమ పెట్టారు. కాల్‌ మనీ వ్యవహారం గురించి సభలో రగడ జరిగిన రోజున.. సీఎం ‘కామ చంద్రబాబు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రోజున రోజా సభలో నాలుక బయటపెట్టి అధికార పార్టీ సభ్యులను వెక్కిరిస్తూ చేసిన రకరకాల విన్యాసాలు అందరూ గమనించారు. ఆ శ్రమతో పాటు, ఆరోజున సస్పెన్షన్‌ వేటు పడిన తరువాత.. అవకాశం వచ్చిన ప్రతిసారీ చంద్రటబాబునాయుడు సర్కారును తిట్టిపోయడానికి గరిష్టమైన సమయాన్ని వెచ్చించడం ద్వారా.. రోజా చాలా శ్రమపడ్డారు.
ఇంత చేసి ఆమె పోరాటానికి ప్రధాన లక్ష్యం అయిన సభలో పునఃప్రవేశాన్ని ఆమె సాధించలేకపోయారు. చివరిప్రయత్నంగా సుప్రీంలో రెండోసారి పిటిషన్‌ వేసినప్పుడు కూడా ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌.. బడ్జెట్‌ సమావేశాలకు హాజరు అయ్యేలా.. సత్వరం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని కోరారు. కానీ రోజా పోరు దండగయ్యేలా సమావేశాలు కూడా ముగిసిపోయాయి. ఇక వర్షాకాల సమావేశాల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఆ లోగా కోర్టుల నిర్ణయాలు ఎలా వస్తాయో తెలియదు. హైకోర్టునుంచి మధ్యంతర ఉత్తర్వులు రాగానే.. తాను గెలిచినట్లు భావించిన రోజా.. చివరికి అధికార పక్షం ఎత్తుగడల మధ్య చిత్తయిపోయింది.
అయితే పోరాటం ద్వారా స్వపక్షంలో కూడా రోజా పెద్ద లాభపడలేకపోయారు. జగన్‌ కోర్టు ఖర్చులకు చేసిన ఆర్థిక సహాయం తప్ప ఆమెకు మరో ప్రయోజనం దక్కలేదు. మధ్యలో అందివచ్చిన పీఏసీ ఛైర్మన్‌ పదవిని ఆమెకు జగన్‌ కట్టబెట్టి ఉంటే ఈ సస్పెన్షన్‌ వ్యవహారంలో ఇంకెన్ని ట్విస్టులు ఉండేవో.. కానీ ఆమెకు అలాంటి గుర్తింపు పార్టీ అధినేత ఇవ్వలేదు. సొంత పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా రోజా తీరు పట్ల పెద్దగా మద్దతు ఇచ్చే ఉద్దేశంతో లేరని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో చూసినప్పుడు.. రోజా ఎపిసోడ్‌ అయ్యోపాపం అని జాలిగొలిపే రీతిలోనే ముగిసిందని అనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close