అరె ఓ సాంబా… అప్పుడే 40 ఏళ్లు గడిచాయా !?

షోలే. మన దేశంలో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ సినిమా. కమర్షియల్ సినిమా సక్సెస్ కు నిలువెత్తు ఉదాహరణ. కలెక్షన్లలో, ప్రశంసల్లో దీనికి సాటి మరొకటి లేదు. హిందీ భాష రానివారు కూడా చాలా మంది షోలే సినిమా చూశారు. గబ్బర్ సింగ్ డైలాగులు అప్పట్లో చాలా పాపులర్. కథ, కథనం, సంగీతం, నటన, డైలాగులు, ఫొటోగ్రఫీ, అన్నీ పక్కాగా కుదిరిన పర్ ఫెక్ట్ సినిమా. అందుకే ఇది మూవీ ఆఫ్ ది మిలీనియం అని బీబీసీ సర్టిఫై చేసింది.

సరిగ్గా 40 ఏళ్ల క్రితం…. 1975 స్వాతంత్ర్య దినోత్సవం నాడు షోలే విడుదలైంది. చరిత్ర సృష్టించింది. అమితాబ్ బచ్చన్ ను సూపర్ స్టార్ ను చేసింది. ధర్మేంద్ర, హేమమాలిని లను ప్రేమికులుగా మార్చింది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

అప్పట్లో 3 కోట్లతో తీసిన షోలే, 15 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ 40 ఏళ్లలో వసూలు చేసిన కలెక్షన్లు, శాటిలైట్ రైట్స్ వగైరాలను కలుపుకొంటే రెవిన్యూ విషయంలో ఆల్ టైం హిట్ షోలేనే అంటారు సినీ పండితులు.

మన దేశంలో తొలి 70 ఎం ఎం సినిమా షోలే

ముంబైలోని మినర్వా థియేటర్లో ఐదేళ్లకు పైగా నిరాటంకంగా ఆడిన సినిమా షోలే.

దేశంలోని 100 థియేటర్లలో 25 వారాలు ఆడిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ షోలే.

హైదరాబాద్ లో ఎన్టీరామారావు నిర్మించిన రామకృష్ణ 70 ఎం ఎం లో షోలే దాదాపు రెండేళ్లు ఆడింది.

హిందీ రాని వారు కూడా ఈ సినిమాను చూశారు. షోలేతోనే హిందీ సినిమాలకు దక్షిణ భారతంలో డిమాండ్ పెరిగింది.

పక్కా కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. వీటిని రాసిన వారు సలీం, జావేద్. సలీం మరెవరో కాదు, నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి.

ఒక్కసారి కొత్తగా ఊహించుకోండి. జై (అమితాబ్) పాత్రలో శత్రుఘ్న సిన్హా. ఠాకూర్ పాత్రలో ధర్మేంద్ర. గబ్బర్ సింగ్ పాత్రలో డేనీ. అదేంటి అంటారా? ముందు అనుకున్న ప్రకారం ఇలాగే సినిమా రావాల్సింది. కానీ మార్పులు జరిగాయి. జంజీర్ లో నటించిన అమితాబ్ అయితేనే జై పాత్రకు కరెక్ట్ అనుకున్నారు దర్శక నిర్మాతలు. అందుకే శత్రుఘ్న సిన్హా వద్దనుకున్నారు.

ఠాకూర్ పాత్రను పోషించాలని ధర్మేంద్ర ముందు అనుకున్నాడు. కానీ వీరూ పాత్రకు జోడీగా హేమ మాలిని నటిస్తుందని తెలియగానే ఆ పాత్రకు షిఫ్ట్ అయ్యాడు.

డేనీకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో గబ్బర్ సింగ్ పాత్ర అంజద్ ఖాన్ కు దక్కింది.

కిత్నే ఆద్మీ థే అంటూ గబ్బర్ సింగ్ ఎంట్రీ ఇచ్చే సీన్ ఒకే చెయ్యడానికి 40 టేకులు అవసరం అయ్యాయి.

యే దోస్తీ పాట షూటింగ్ కు 21 రోజులు పట్టింది.

బంగళాలోని దీపాలన్నింటినీ జయ భాదురి ఆర్పే సీన్ షూటింగ్ కు 20 రోజులు పట్టింది.

బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని రామనగర వద్ద గుట్టల నడుమ ఓ ఊరి సెట్టింగ్ వేసి రెండున్నర సంవత్సరాలు షూటింగ్ జరిపారు. సినిమాలో దాని పేరు రాంగఢ్. ఇప్పుడు అది ప్రముఖ పర్యాటక కేంద్రం.

ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి 4 నెలల ముందు అమితాబ్, జయభాదురి పెళ్లి చేసుకున్నారు. అలా, కొత్త పెళ్లి కూతురు జయ ఈ సినిమాలో వితంతువుగా నటించింది.

ఈ సినిమాతోనే ధర్మేంద్ర, హేమమాలిని ప్రేమాయణం మొదలైంది. ఐదేళ్ల తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.

షోలే మూవీ ఆఫ్ ది మిలీనియం అని బీబీసీ 1999లో ప్రకటించింది.

బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్ లో షోలేనే ఆల్ టైమ్ గ్రేట్ హిట్ అని అత్యధికులు ఓటు వేశారు.

2014లో వచ్చిన షోలే 3డి వెర్షన్ కు కూడా మంచి ఆదరణ లభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close