ఎపి నుంచి రాజ్యసభకు ఎవరు?

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తనను ఎంపిక చేయాలని తెలంగాణాలో సీనియర్ తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నరశింహులు కోరుతున్నారు.” నన్ను రాజ్యసభకు పంపగలనని గతంలోనే మీరు హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చాలని కోరడానికే వచ్చాను” అని రెండురోజుల క్రితం విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి మొత్కుపల్లి చెప్పారని తెలిసింది. ఏపీ నుంచి 4 రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్‌, జేడీ శీలం, జైరాం రమేష్‌ కాల పరిమితి ఏప్రిల్ లో ముగుస్తోంది. ఎమ్మెల్యేలు ఎన్నుకోవలసిన ఈ నాలుగు పదవుల్లో ప్రస్తుత బలాల ప్రకారం తెలుగుదేశానికి ముగ్గురిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకరిని గెలిపించుకునే అవకాశం వుంది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌ రావు, ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌ రావు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు.నందమూరి హరికృష్ణ కూడా రాజ్యసభ సీటు కోరే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడుగా ఢిల్లీ వెళ్ళాలన్నది తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి ఆంతరంగికుడు యనమల రామకృష్ణుడు చిరకాల ఆశ, ఆకాంక్ష. రాజకీయ సమీకరణలలో అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప కేంద్రంలో మంత్రులుగా వున్న నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలకు మళ్ళీ రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చే వాతావరణమే కనబడుతోంది. మిత్రధర్మంగా నిర్మాలా సీతారామన్‌ ఎన్నికయ్యేలా చూడవలసిన బాధ్యత తెలుగుదేశానిదే. ఈ నేపధ్యంలో మిగిలిన ఒక్క సీటుకీ పోటీ పడుతున్న మోత్కుపల్లి, కంభంపాటి, కరణం బలరామ్, బీరం మస్తాన్ రావు, నందమూరి హరికృష్ణ, యనమల రామకృష్ణుడు లలో అవకాశం ఎవరికి అన్నది కుల, ప్రాంత సమీకరణలను బట్టి వుంటుంది. వీరెవరూ కాకుండా పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ రాజ్యసభ సభ్యుడైనా ఆశ్చర్యంలేదు. కష్టకాలంలో తెలుగదేశానికి ఆర్ధిక వనరులు సమీకరించిన సుజనాచౌదరి రాష్ట్రానికి ఎమ్మెల్సీగా వచ్చి రాష్ట్రమంత్రి అవుతారని ఆయనస్ధానంలో యనమల రామకృష్ణుడు లేదా లోకేష్ రాజ్యసభ సభ్యులై కేంద్రమంత్రి వర్గంలో చేరవచ్చన్న స్పెక్యులేషన్ ఒకటి వుంది. ప్రధానమంత్రి కార్యాలయం అంతగా సంతృప్తి చెందని సుజనా చౌదరిని వెనక్కి పిలవడమే మంచిదనుకోవడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. కేంద్రమంత్రిగా వుంటే ఆహోదాలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో ప్రోటోకాల్ మర్యాదలతో పర్యటనలు చేస్తూ పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం వుంది. ఈ బాధ్యత వారసుడైన లోకేష్ కు అప్పగిస్తారా? అనుభవజ్ఞుడైన యనమలకు కేటాయిస్తారా అన్నది చంద్రబాబు ఆలోచనల్లోనే వుంది. రాష్ట్రం ఆర్ధిక సమస్యలతో సతమతమౌతున్న సమయంలో యనమలను ఢిల్లీ పంపుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. చంద్రబాబు యధాపూర్వస్ధితికి వచ్చేశారు. రాజకీయ నాయకత్వం మీదకంటే అధికార యంత్రాంగం మీద ఆధారపడటమే ఎక్కువైంది. మంత్రి అనేది లాంచన ప్రాయమే! కనుక యనమలతో సహా ఏనాయకుడు ఎక్కడున్నా పెద్దవిషయం కాదు అనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close