కొత్త కులపెద్దల పట్ల పాత’కాపు’ల్లో అసహనమా?

కులాలకు సంబంధించిన సంఘాలు మన సమాజంలో అనివార్యంగా ఉన్నాయి. కులరహిత సమాజం అనే కల అంత సులువుగా సాధ్యమయ్యేది కాదు. అయితే కులసంఘాలు దాదాపుగా ప్రతి కులానికీ ఉన్నాయి. ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. కులానికి సంబంధించిన సమైక్యవాణిని ఈ సంఘాలు వినిపిస్తూ ఉంటాయే తప్ప.. అందులో మళ్లీ రాజకీయ పక్షాల ప్రస్తావన ఉండదు. ఉండనంత వరకే ఆ కులసంఘాలకు మంచి పేరు ఉంటుంది. రాజకీయ పార్టీల వారీగా కులసంఘంలో మళ్లీ చీలికలు వస్తే.. అంతా చిందర వందరగా తయారవుతుంది. అందుకే ఆయా సంఘాల పెద్దలు కులానికి సంబంధించినంత వరకు అందరూ ఒక్కటే. పార్టీలు వేర్వేరు కావచ్చు… అనే సమైక్య గీతం ఆలపిస్తూ ఉంటారు. కులం బాగు కోసం మాత్రమే కులసంఘాల నేతలు కాన్సంట్రేట్‌ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి కులసంఘాలకు కొత్త ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా కాపు గర్జన సందర్భంగా చెలరేగిన హింస, అది ప్రజా ఆస్తులకు నష్టం కలిగించిన తీరు, ప్రజాజీవనాన్ని ఛిద్రం చేసిన వైనం ఇవన్నీ కొత్త భయాలను రేకెత్తిస్తున్నాయి. కుల సంఘాలకు పెద్దలుగా ఒకప్పట్లో చెలామణీ అయిన వారు.. తమ కులానికి ఏ మంచి జరిగినా తమ చేతులమీదుగానే జరగాలని, మరొకరి ద్వారా కులానికి మంచి జరిగినా కూడా సహించబోమని అనుకుంటున్నారా, కులం మీద తమ పెత్తనం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారా, కులంలో కొత్త నాయకత్వం తయారు కావడాన్ని సహించలేకపోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాపుగర్జన సందర్భంగా మలుపుతీసుకున్న ఆందోళన, తత్సందర్భంగా చెలరేగిన హింసలో ఈ కోణాలన్నీ దాగి ఉన్నాయి. ఒకప్పట్లో కాపు కులదీపకుడిగా కులపెద్దగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు నిర్దిష్టంగా ఫలానా పార్టీ అంటూ లేకుండా నిర్వ్యాపారంగా ఉన్నారు. మరికొందరు పాతకాలం నాటి కాపు సెలబ్రిటీలు కాంగ్రెస్‌, వైకాపాల్లో ఉన్నారు. అదే సమయంలో నవతరం కాపు నాయకులుగా, సెలబ్రిటీ హోదా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, గంటా శ్రీనివాసరావు, నారాయణ లాంటి వారంతా ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ప్రత్యేకించి తాను కులనాయకుడు కాకపోయినా.. పవన్‌ కల్యాణ్‌ లాంటి వారు అధికారపక్షానికి అనుకూలంగానే ఉన్నారు. స్థూలంగా గమనించినట్లయితే కాపు వర్గంలో కొత్త నాయకత్వం ఎదిగివస్తున్న సంధిసమయం ఇది. ఇలా కులంలో కొత్త నాయకత్వం పుట్టడాన్ని పాతకాపులు సహించలేకపనోతున్నారా? అనిపిస్తోంది. పైగా కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ద్వారా కాపులు బీసీలు అయిపోవడం కూడా జరిగితే.. కాపులకు ఏమైనా మేలు జరిగితే.. దాని వలన తమ నాయకత్వానికి శాశ్వతంగా దెబ్బ పడుతుందా అని కూడా వారు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పడరాదని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. అందుకే ఇలాంటి హింసాత్మక చర్యలను ప్రేరేపించడం ద్వారా పాత కాపు నాయకులు అందరి దృష్టి తమ మీద మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారేమో అనిపిస్తోంది. ప్రస్తుత దుర్ఘటనలో దారుణమైన విషయం ఏంటంటే.. ఒక కులానికి సంబంధించిన వారు ఒక డిమాండుతో ఉద్యమం ప్రారంభించిన తొలిరోజునే, ఇలాంటి హింసకు తెగబడడం చాలా దురదృష్టకరం. ఏ ఉద్యమమైనా సుదీర్ఘకాలం సాగిన తర్వాత ఆ అసంతృప్తిలో హింసగా మారితే ఒక ఎత్తు. కానీ ఒకటోరోజునే హింసారూపం దాల్చడం.. దారుణం. అయితే ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు విపక్షాల మీదకు నెట్టేయడానికి పాలకపక్షం చూడడం సహజం. దానికి తగినట్లుగానే ఇప్పుడు తెలుగుదేశం సర్కారు కూడా.. ఈ అల్లర్ల వెనుక వైకాపా, కాంగ్రెస్‌ పార్టీల వారు కుట్ర చేశారంటూ ఆరోపించారు. వారే అల్లర్లు చేయించారని ఆరోపించారు. అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. కాపువర్గం పాత నాయకుల్లో అసహనమే ఇలాంటి పెట్రేగిపోయే ధోరణులకు దారితీస్తుంటే గనుక అది చాలా పెద్ద ప్రమాదం అని గుర్తించాలి. ఈ రావణ కాష్టం ఇప్పట్లో చల్లారదని కూడా మనం తెలుసుకోవాలి. ప్రభుత్వాలు.. అంతకంటె మించి.. కాపుకులంలోని సోదరులందరూ సమైక్యంగా.. అలాంటి దురాలోచనలను గమనించి వివేచనతో, విచక్షణతో తమ అభివృద్ధి గురించి తాము ప్లాన్‌ చేసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close