క్రిష్ ప‌ని పూర్తి… ఇక అంతా ప‌వ‌న్ చేతుల్లోనే

ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం క్రిష్ ఓ క‌థ‌ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసింది. ఏఎం ర‌త్నం ఈ చిత్రానికి నిర్మాత‌. ప్ర‌స్తుతానికి స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ కూడా డైలాగ్ వెర్ష‌న్‌ని రాసిచ్చేశార‌ని తెలుస్తోంది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యం కోస‌మే ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్ – క్రిష్ మ‌ధ్య భేటీ జ‌రిగింది. డైలాగుల‌తో స‌హా, ప‌వ‌న్‌కి క‌థ వినిపించేశాడు క్రిష్‌. ప‌వ‌న్‌కి ఈ క‌థ బాగా న‌చ్చేసింది కూడా. కాక‌పోతే సినిమా ఎప్పుడ‌న్న‌ది మాత్రం ప‌వ‌న్ తేల్చ‌డం లేదు. అటు `పింక్‌` క‌థ కూడా రెడీగానే ఉంది. ప‌వ‌న్ `ఓకే` అన‌డ‌మే ఆల‌స్యం. స‌మ‌స్యేంటంటే.. పింక్‌, క్రిష్ సినిమా ఒకేసారి ప‌ట్టాలెక్కే ఛాన్సు లేదు. `పింక్`లో ప‌వ‌న్ గెడ్డంతో క‌నిపిస్తాడు. క్రిష్‌సినిమాకి ఆ గెట‌ప్ అవ‌స‌రం లేదు. సో.. పింక్ అయ్యాకే క్రిష్‌సినిమా మొద‌ల‌వుతుంది. అయితే పింక్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో, ఎప్పుడు పూర్త‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. దాంతో క్రిష్ మ‌రిన్ని రోజులు ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. పింక్ త‌ర‌వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం… వ‌చ్చే నెల‌లోనే క్రిష్‌సినిమా మొద‌లైపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close