జ‌మ్మూ కాశ్మీర్ లో మాజీ ముఖ్య‌మంత్రులు అరెస్ట్!

ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తూ రాజ్య‌స‌భ‌లో మోడీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు ఆమోదం పొందిన సంగ‌తి తెలిసిందే. ఈ బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ఒక రోజు ముందు నుంచే జ‌మ్మూ కాశ్మీర్ లో భారీ ఎత్తున ముందుజాగ్ర‌త్త‌ల‌ను కేంద్రం తీసుకుంది. ఇదే స‌మ‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి పీడీపీ అధినేత్రి మెహ‌బూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లాల‌ను ముందు రోజు నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు దాన్ని అరెస్టుగా మార్చి… ఈ ఇద్ద‌రు లీడ‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే గృహ నిర్బంధంలో ఉన్న ముఫ్తీని పోలీసులు ఆమెని హ‌రినివాస్ అతిథి గృహానికి త‌ర‌లించారు.

370 ఆర్టికల్ స‌భ‌లో ఆమోదం పొందిన నేప‌థ్యంలో ముఫ్తీ స్పందిస్తూ… కాశ్మీర్ ని భార‌త్ దురాక్ర‌మ‌ణ చేస్తోంద‌నీ, ఇక‌పై కాశ్మీర్ ని భార‌త్ ఆక్ర‌మిత కాశ్మీర్ గా పిలుస్తామంటూ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒమ‌ర్ అబ్దుల్లా కూడా స్పందిస్తూ… కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై న్యాయ పోరాటం చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. మ‌రికొంత‌మంది నాయ‌కుల్ని కూడా జ‌మ్మూ కాశ్మీర్లో అరెస్టుల చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌జ‌లను రెచ్చ‌గొట్టే విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌నీ, మూక‌ల్ని విధ్వంసానికి ప్రేరేపించేలా కొంద‌రు నాయ‌కుల వ్యాఖ్య‌లుంటున్నాయ‌ని పోలీసులు అధికారులు చెబుతున్నారు.

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో కాశ్మీర్లో ఇలాంటి కొన్ని ఉద్రిక్త‌త‌లు ఉంటాయ‌నే అంచ‌నా ముందే ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఇప్ప‌టికే బ‌ల‌గాల‌ను పంపించి, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ ప‌రిస్థితి కొద్దిరోజులు త‌ప్ప‌దు అనే అభిప్రాయ‌మే వ్య‌క్త‌మౌతోంది. ఎందుకంటే, కాశ్మీర్లో భార‌త్ వ్య‌తిరేకంగా పాక్ జెండాలు ఎగిరిన సంద‌ర్భాలూ, భార‌త్ వ్య‌తిరేక నినాదాలు శ్రీన‌గ‌ర్లో వినిపించిన సంద‌ర్భాలు గ‌తంలో ఉన్నాయి. అంటే ప‌రోక్షంగా ఇక్క‌డి మూక‌ల‌కు బ‌య‌ట్నుంచి మద్ద‌తు ల‌భిస్తోంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు.

ఇక‌, భార‌త ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంపై పాకిస్థాన్ కూడా స్పందించింది. ఇలాంటి నిర్ణ‌యం ఏక‌ప‌క్షంగా ఎలా తీసుకుంటార‌ని ఆ దేశం అభిప్రాయ‌ప‌డుతోంది. దీనిపై ఐక్యరాజ్య‌స‌మితికి వెళ్తామని అంటోంది. నిజానికి, ఇది మ‌న‌దేశానికి చెందిన పూర్తిగా అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం. ఏదేమైనా, జ‌మ్మూ కాశ్మీర్లో ప్ర‌స్తుతం కొంత ఉద్రిక్త‌త‌కు ఆస్కారం ఉంద‌నీ, అందుకే ముంద‌స్తుగా కొంద‌రు నాయ‌కుల అరెస్టుల్లాంటివి త‌ప్ప‌దనే అభిప్రాయం ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close