టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు పిల్లులట!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న టీఆర్ఎస్, టీడీపీ పార్టీల ఎంపీలను వారి ప్రత్యర్థిపార్టీలకు చెందిన నేతలు పిల్లులతో పోల్చిన వైనం ఇవాళ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్, టీడీపీ పార్టీ ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు పిల్లులతో పోల్చారు. అయితే ఇది వీరిద్దరూ అనుకుని చేసిన విమర్శకాకపోవటం, కాకతాళీయంగానే జరగటం విశేషం. మధుయాష్కీ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైకోర్ట్ విభజనపై పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ ఎంపీలు వెంకయ్యనాయుడు బెదిరిస్తే పిల్లుల్లా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ అవసరాలకోసం ప్రధాని అడుగులకు మడుగులొత్తటం మానుకోవాలని హితవు పలికారు.

మరోవైపు జగన్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశంపార్టీ ఎంపీలు ఢిల్లీలో పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడాదిన్నరకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదాకోసం ఎందుకు పట్టుబట్టలేదని అడిగారు. ప్రత్యేక హోదా తప్ప ప్రత్యేక ప్యాకేజిలను అంగీకరిస్తే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు. ప్రత్యేకహోదాపై చర్చించేందుకు ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా ఎందుకు సమావేశపరచటంలేదని అడిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close