డీఎస్‌ ద్వారా డీల్‌ ఫైనలైజ్‌ చేసుకున్న దానం!

దానం నాగేందర్‌…తన అవసరానికి ఎన్నిసార్లు ఎన్ని పార్టీల్లోకి అయినా గెంతడానికి సిద్ధంగా ఉండే నాయకుడు ముద్ర పడిన సీనియర్‌ రాజకీయ వేత్త. గ్రేటర్‌ ఎన్నికలకు కొన్ని వారాల ముందు.. దానం ఇక తెరాసలో చేరిపోతున్నట్లే అని బీభత్సంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటికి దానికి పుల్‌స్టాప్‌ పడింది. మళ్లీ తాను పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌లో ఉంటా అంటూ ప్రతిజ్ఞలు చేసి.. అందరితో కలిసి మెలిసి తిరిగారు. కానీ ఇప్పుడు గ్రేటర్‌ ఫలితాలు వచ్చేసరికి దానం నాగేందర్‌కు దిమ్మతిరిగి క్లారిటీ వచ్చేసినట్లుంది. భవిష్యత్తులో కనీసం తనకు ఎమ్మెల్యేస్థానమైనా స్థిరంగా మిగలాలంటే.. తెరాసలోకి వెళ్లడం తప్ప గత్యంతరం లేదని అనుకుంటున్నట్లుగా.. కనిపిస్తోంది. అందుకే ఆయన తక్షణం తన గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. అయితే దీనికంటె ముందుగానే.. ఆయన తన రాజకీయ గురువు.. ప్రస్తుతం తెరాసలో ఒక మోస్తరుగా చక్రం తిప్పుతున్న నాయకుల్లో ఒకరైన డీ శ్రీనివాస్‌తో మంతనాలు పూర్తి చేసుకుని డీల్‌ మాట్లాడుకున్న తర్వాతనే.. ఇక్కడ రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నది. నిజానికి దానం నాగేందర్‌ ఎన్నడో తెరాసలో చేరిపోయి ఉండాల్సింది. అప్పట్లో ఆయన చేరిక కూడా డీఎస్‌ ద్వారానే ఫైనలైజ్‌ అయింది. కానీ ఆయనకు ఏం పదవులు కావాలనే విషయంలో బేరాలు సెట్‌ కాలేదు. దానం ఏకంగా మేయర్‌ పీఠానికి టెండర్‌ పెట్టారని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే తెరాస మాత్రం మేయర్‌ పీఠం కుదర్దు.. బుగ్గకారు ఉండేలా ఏదో ఒక నామినేటెడ్‌ పదవి మాత్రం ఇస్తాం అని ఆఫర్‌ చెప్పినట్లు వినిపించింది. దానితో పాటూ కేసీఆర్‌ సమక్షంలో చేరాలా? కేటీఆర్‌ సమక్షంలో చేరాలా? అనే విషయంలో కూడా తన స్థాయికి తగినట్లుగా తెరాస గౌరవించడం లేదనే అభిప్రాయం కలిగి దానం చేరడానికి ముందే అలిగి.. తెరాసలో చేరడాన్ని మానుకున్నట్లుగా పుకార్లు వచ్చాయి. సీన్‌ కట్‌ చేస్తే- గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌లో ఉండిపోయినందువలన సాధించింది ఏమిటో.. దానంకు తెలిసిపోయింది. ఇలాగే ఉండడం వలన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆయనకు స్పష్టంగా కనిపించినట్లుంది. అందుకేనేమో వెంటనే తన పదవికి రాజీనామా చేసేశారు. కాకపోతే ఇప్పుడు ఆయనకు తెరాస వద్ద ‘బేరమాడే శక్తి’ సన్నగిల్లిపోయిందని అనుకోవాలి. నామినేటెడ్‌ పోస్టు అయినా ఇస్తారా? లేదా? అనేది అనుమానమే. కాకపోతే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నగరంలో ఏదో ఒక చోట నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తే చాలు.. తతిమ్మా డిమాండ్లు ఏమీ లేకుండా.. నిశ్శబ్దంగా పార్టీలో చేరడానికైనా నాయకులు ఒప్పుకునే పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తొందర్లోనే డీఎస్‌ నిర్ణయించిన ముహూర్తానికి దానం చేరిక ఉంటుందని.. తెరాస అధినేతల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close