దేశం నుంచి కాదు దేశంలోనే స్వేచ్చ కోరుకొంటున్నాము: కన్నయ కుమార్

జె.ఎన్.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్ తీహార్ జైలు నుండి నిన్న విడుదలయిన తరువాత యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్ధులు నిర్వహించిన ఒక బహిరంగ సభలో చాలా ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సుమారు 50వేల మందికి పైగా విద్యార్ధులు, ప్రజలు హాజరయిన ఆ సభలో ఆయన ప్రసంగిస్తూ “మేము భారత్ నుంచి మాకు స్వాతంత్ర్యం కావాలని కోరుకోవడం లేదు. ఈ దేశంలో మాకు స్వేచ్చ కావాలని కోరుకోన్నాము. ఈ దేశాన్ని దోచుకుతింటున్న వారి నుండి మాకు స్వేచ్చ కావాలని కోరుకోన్నాము. దారిద్యం నుండి విముక్తి కావాలని కోరుకొన్నాము,” అని చెప్పారు.

“నేను జైల్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని కలిసాను. అతను కూడా పి.హెచ్.డి చేయాలనుకొన్నాడుట కానీ అతని వద్ద ఆ చదువు ‘కొనడానికి’ లక్షలు లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకోవలసి వచ్చిందని చెప్పాడు. కనుక అటువంటి దారిద్ర్యం నుండి దేశ ప్రజలను విముక్తిని మేము కోరుకొంటున్నాము తప్ప దేశం నుంచి కాదు. ప్రధాని నరేంద్ర మోడి ‘సత్యమేవ జయతే’ అని చెప్పారు. దానిని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే అది ఈ దేశానిది. ప్రజలందరిదీ. ప్రధాని మోడి రేడియోలో ‘మన్ కి బాత్’ (మనసులో మాట) అనే కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుంటారు. కానీ ఆయన ప్రజల మాటను వినాలనుకోరు. అటువంటప్పుడు నాకు ఆయనని హిట్లర్ గురించి మాట్లాడమని అడగాలనిపిస్తుంటుంది లేదా పాక్ నియంత పర్వేజ్ ముషరఫ్ గురించి మాట్లాడమని చెప్పాలనిపిస్తుంటుంది,” అని కన్నయ్య కుమార్ అన్నారు.

“మన తల్లితండ్రులతో బలమయిన అనుబంధం కలిగి ఉండటం ఎంత అవసరమో నాకు జైల్లో ఉన్నప్పుడు తెలిసి వచ్చింది. కనుక విద్యార్ధులు అందరినీ కూడా తమ తల్లి తండ్రులతో అనుబంధం బలపరుచుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశ వ్యాప్తంగా ప్రజలు నాకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. నా అనుభవాలను, ఆలోచనలను దేశ ప్రజలందరితో పంచుకొంటాను. అలాగే నేను నా స్వగ్రామానికి వెళ్లి అక్కడ దళితులు, నిరుపేదలతో నా ఆలోచనలు పంచుకొంటాను. దేశంలో ఇటువంటి అణిచివేత చాలా కాలంగా సాగుతోంది. దేశంలో 69 శాతం మంది ప్రజలు ఇటువంటి అణచివేత ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. కానీ వారిలో కేవలం 31 శాతం మంది మాత్రమే మాయ మాటలు నమ్మి ఓటు వేశారు,”అని కుమార్ చెప్పారు.

“దేశద్రోహులపైనే కేసులు నమోదు చేస్తున్నామని ప్రభుత్వం చెపుతుంది కానీ కేజ్రీవాల్, సీతారం ఏచూరి వంటివారిని అభిమానించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దేశద్రోహులు ముద్రవేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఆ విధంగా విద్యార్ధులను అణచివేయాలని ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తే వాళ్ళు అంతగా ప్రతిఘటిస్తారు. కనుక వారిని అణచివేయడం సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ వేముల కోసం మనం పోరాటం మొదలుపెట్టాము. ఇప్పుడు జె.ఎన్.యు.లో కూడా మరో పోరాటం మొదలుపెట్టాము. ఒత్తిళ్లకు లొంగకుండా ఇకపై మన పోరాటం కొనసాగుతుంది,” అని కుమార్ చెప్పారు.

“జైలు నుండి విడుదలయిన తరువాత మళ్ళీ స్వేచ్చ కోరుతూ నినాదం చేస్తావా? అని ఎవరో నన్ను అడిగారు. అవును తప్పకుండా మళ్ళీ నినదిస్తాను. మాకు ఈ అణచివేత నుండి, దోపిడీ నుంచి, దారిద్ర్యం నుంచి స్వేచ్చ కావాలి,” అని నినదిస్తూ కన్నయ కుమార్ తన ప్రసంగం ముగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close