నరేంద్ర మోడి బాటలో కేసీఆర్!

బంగారు తెలంగాణ స్వాప్పికుడు కె చంద్రశేఖర రావు, తానొకప్పుడు సన్నాసి అని తిట్టిని నరేంద్ర మోడీనే అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఐపాస్ గా పిలిచే పారిశ్రామిక విధాన ఆవిష్కరణ తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవడం, భూమిని కేటాయిస్తామని హామీ ఇవ్వడం, విద్యుత్తు, నీటి సరఫరాకు గ్యారంటీ ఇవ్వడం… ఒకప్పుడు గుజరాత్ లో మోడీ అనుసరించిన విధానాలే.

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన తర్వాత ముందు విద్యుత్ రంగంలో విజయం సాధించారు. రెండేళ్లలోనే నిరంతర విద్యుత్ సరఫరా చేయడం మొదలుపెట్టారు. దీంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశం కలిగింది. పారిశ్రామిక వేత్తలను పెద్ద ఎత్తున ఆహ్వానించారు. వైబ్రంట్ గుజరాత్ సమిట్ ద్వారా వేల కోట్లు, లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్శించారు.

తెలంగాణలో కేసీఆర్ అదే బాటలో నడుస్తున్నారు. రెండు మూడేళ్లలో విద్యుత్ లో మిగులు రాష్ట్రంగా మార్చడానికి ప్లాన్ చేశారు. కొత్త ప్లాంట్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు. థర్మల్ తో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. విద్యుత్ పంపిణీలోనూ విజన్ ప్రదర్శిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ రాకపోయినా ఇబ్బంది లేని విధంగా విద్యుత్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలే అమలు చేయడానికి సంకల్పించారు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తమైన బ్రాండ్ హైదరాబాద్ ఇమేజిని వీలైనంత క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరైన ఎత్తుగడ. నిర్ణీత కాల వ్యవధిలో సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు రెండు వారాల్లో లైసెన్సులు ఇస్తామనడం పారిశ్రామిక వేత్తలను బాగా ఆకర్షించే విషయాలు.

దేశంలో మొదటి నుంచీ పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందిన ముంబై ప్రత్యేకతలు వేరు. ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టేవారు ముంబైకి మించి ఆలోచిస్తున్నారు. అందుకే, హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ ఈ రేసులో పోటీ పడుతున్నాయి. మిగతా నగరాలకంటే హైదరాబాద్ కు కొన్ని అనుకూలాంశాలున్నాయి. బ్రాండ్ హైదరాబాద్ వీటిలో ఒకటి. అపారమైన భూమి మరో అంశం.

నిజాం నవాబులకు చెందిన వేల ఎకరాల మిగులు భూములు ప్రభుత్వ పరమయ్యాయి. కాబట్టి, హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు పెట్టే వారికి కావాల్సినంత భూమిని కేటాయిస్తామని కేసీఆర్ తన పారిశ్రామిక విధానంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో మరే నగరానికీ ఈ అవకాశం లేదు. వేరే నగరాల్లో భూమిని కొనుక్కోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో ఇది రెడీమేడ్ లాంటిది. సరిగ్గా ఈ ప్లస్ పాయింటునే క్యాష్ చేసుకుంటే లక్షల కోట్ల పెట్టుబడులతో వేలాది పరిశ్రమలను రాబట్టే వీలుంది. అయితే కేసీఆర్ హామీ ఇచ్చినట్టు, అవినీతి రహిత విధానాలు, ఇబ్బంది కలిగించని విధంగా అనుమతులు నిజమైతేనే తెలంగాణ పారిశ్రామికంగా ముంబైతో పోటీ పడుతుంది.

అవినీతి గానీ పారిశ్రామిక వేత్తలను ఇబ్బంది పెట్టే వాతావరణం గానీ కనిపిస్తే మాత్రం బ్రాండ్ హైదరాబాద్ కూడా తెలంగాణను కాపాడలేక పోవచ్చు. ఈ విషయంలో కేసీఆర్ జాగ్రత్త వహించాల

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close