పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు, సుప్రీం కు నచ్చచెబుతామన్న మంత్రి

కరోనా విపత్తు కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. అయితే ఒక నాలుగైదు రాష్ట్రాలు మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతాం అని మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా ఇలా పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయనుంది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కూడా స్పందించారు. వివరాల్లోకి వెళితే..

పన్నెండవ తరగతి పరీక్షల విషయం ఇవాళ సుప్రీం కోర్టులో చర్చకు వచ్చింది. 18 రాష్ట్రాలలో ఇప్పటికే పరీక్షలు రద్దు చేశారని, ఆరు రాష్ట్రాలలో మొదట్లోనే పరీక్షలు నిర్వహించారని, నాలుగు రాష్ట్రాలు మాత్రం పరీక్షలు రద్దు చేయకుండా పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్నాయని , ఈ నాలుగు రాష్ట్రాలకు పరీక్షల రద్దు విషయంలో నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్ర ప్రదేశ్ , పంజాబ్ , త్రిపుర, అసోం రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు 11 వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న కేరళకు కూడా నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అనుసరించి జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు వాక్సినేషన్ కు కూడా నోచుకోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ప్రాణాలను ప్రభుత్వాలు పణంగా పెడుతున్నాయి అని న్యాయకోవిదులు కొందరు అభిప్రాయ పడుతున్నారు.

అయితే సుప్రీంకోర్టు నోటీసుల విషయం పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరీక్షలు ఎంత ముఖ్యం అన్న విషయాన్ని తాము సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close