పెద్దకులాల పేదలు-కాపులు-బిసిలు-మధ్యలో చంద్రబాబు

(రాజకీయాల్లో కులాల కెమిస్ట్రీ-4) Click here for Part 1 Click here for Part 2 Click here for Part 3 కాపులను గతంలోనే వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారు…తొలగించారు…చేర్చారు…తొలగించారు…అదంతా ఆయా ప్రభుత్వాల అంటే ముఖ్యమంత్రుల ఇష్టాఇష్టాల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులద్వారా జరిగింది. ముద్రగడ పద్మనాభం ఉద్యమించిన ఫలితంగా 1994 లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కాపుల్ని బిసిల్లో చేరుస్తూ ఉత్తర్వులు జారీచేయించారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలతో పాటు మొత్తం 14 కులాలను బిసిల జాబితాలో చేరుస్తూ అప్పట్లో జిఓలు విడుదల అయ్యాయి. ఆ నిర్ణయాన్ని బిసి సంక్షేమ సంఘం తరపున ని ఆర్ కృష్ణయ్య కోర్టులో సవాలు చేయడంతో ఆ ఉత్తర్వుల అమలు నిలచిపోయింది. అప్పటి కోర్టు ఆర్డర్ ప్రకారం కాపులకు ఇవ్వదలచిన రిజర్వేషన్ ఎంతశాతమో తేల్చాలి. అందులో ఏ కేటగిరీలో ఎంతెంత శాతం వుండాలో తేల్చాలి. ఈ ఆదేశాలు ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తులలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ నిర్ణయం తీసుకునే హక్కు నేరుగా ప్రభుత్వానికే వుందని ఇద్దరు, న్యాయవ్యవస్ధ (కమీషన్ నియామకం) అంటే జుడీషియల్ ద్వారానే ఈ నిర్ణయం తీసుకోవాలని ముగ్గురు ఆర్డర్ లో పేర్కన్నారు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో విజయభాస్కరరెడ్డీ, ముద్రగడ పద్మనాభమూ ఇద్దరూ ఓడిపోవడంతో కోర్టు అభ్యంతరాలను సరిదిద్దుకోడానికి పొలిటికల్ విల్ లేకుండా పోయింది. కాపు రిజర్వేషన్ ఫైలు అటక ఎక్కేసింది. రాష్ట్రవిభజన అనంతర పరిణామాల్లో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల ప్రాబల్యం నాలుగైదు జిల్లాలకు తగ్గిపోయింది. వారు స్ధూలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట వున్నారు. కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్ధకమైపోయింది. చిరంజీవి మీద ఆశలు పెట్టుకుని ఒక విధమైన నిస్పృహతో వున్న కాపుల మద్దతు తెలుగుదేశానికి కూడగట్టడానికి చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ అస్త్రాన్ని బయటకు తీశారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపులను బిసిల్లో చేరుస్తామని, బిసి కార్పొరేషన్ తరహాలోనే కాపులకు ఇచ్చే బ్యాంకు రుణాలపై మార్జిన్ మని, సబ్సిడీలు చెల్లించడానికి 5000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 14 నెలలు గడచినా హామీ నెరవేర్చలేదని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రికి మొదటి ఉత్తరం రాశారు. అలా మూడు ఉత్తరాలు రాశాక ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపుల్ని బిసిల్లో చేర్చే విషయం అధ్యయనం చెయ్యడానికి మంజునాధ కమీషన్ ను నియమించారు. చిత్తశుద్ది వుంటే ఈ ప్రాసెస్ ఇప్పటికే పూర్తి చేసేవారు. ఇదంతా కాలయాపన తతంగమంటూ తాను సూచించిన గడువు ముగిశాక ముద్రగడ దీక్ష ప్రారంభించారు. సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా హామీలు ఇచ్చేయడం, హెచ్చరికలు వినబడుతున్నా సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం ఏమి చేసినా రాజకీయంగా ఆక్రెడిట్ తెలుగుదేశానికో చంద్రబాబుకో కాక ముద్రగడకే దక్కే పరిస్ధితి ఏర్పడింది. అభ్యంతరపెడుతున్న బిసిలను దూరం చేసుకోవడమంటే సంచి లాభాన్ని చిల్లు చెల్లగొట్టడమే అవుతుంది. కాపులు కూడా బిసిలైతే మొత్తం రిజర్వేషన్లు తమిళనాడులాగానో, కర్నాటక లాగానో 69 శాతమో లేక 72 శాతమో అయితే అగ్రవర్ణాల వారిలో పేదల మాటేమిటి విద్యాసంస్ధల్లో సీటు దొరుకుతుందా? చిన్న ఉద్యోగమైనా దొరుకుతుందా? వారికి ఏం సమాధానం చెబుతారు? టెలివిజన్లు కమ్యూనికేషన్లు క్షణాల్లో సమాచారాన్ని తవ్వి తీసి బట్వాడా చేస్తున్న కాలంలో ఫేస్ బుక్, వాట్సప్ ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తున్న మెరపు వేగంలో మాటనిలబెట్టుకోలేని, మాటతప్పే నాయకులకు కూడా అధికార హోదాలు కొనసాగుతాయి. కానిప్రజల్లో వారి ప్రతిష్ట వారి కళ్ళముందే మసకబారుతుంది. కాపులకు రిజర్వేషన్ల హామీతో చంద్రబాబుకి ముద్రగడతో తలగోక్కునే పరిస్ధితికీ, ప్రత్యేక హోదా హామీతో బిజెపి/వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ తో తలగోక్కునే పరిస్ధితికీ ఇదేమూలం…ఎంత కంట్రోల్ చేసినా డామేజి వారిని వెంటాడుతూనే వుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close