బాబాయ్, అబ్బాయ్…మధ్యలో తెరాస

అబ్బాయ్: బాబాయ్ మనం తెరాసవాళ్ళ గురించి చాలా తప్పుగా అనుకొన్నాము కానీ వాళ్ళు మనకంటే చాలా మంచోళ్ళు తెలుసా…?

బాబాయ్: అదేమిటిరా…నిన్న మొన్నటిదాక వీధిలో గులాబీ కండువా కనబడితే భయపడేవాడివి..వాళ్ళ పేరు ఎత్తితే కోప్పడిపోయేవాడివి? ఇంతలోనే వాళ్ళతో నీకు దోస్తీ ఎలా కుదిరిపోయిందిరా?

అబ్బాయ్: అదేమీ లేదు బాబాయ్…మనమే అనవసరం ఏదేదో ఊహించేసుకొన్నాము..కానీ వాళ్ళు చాలా మంచోళ్ళని అర్ధమయింది…

బాబాయ్: ఒక్కరోజులోనే అలా ఎలాగా అర్ధమయిందేమిటి? నిన్న మొన్నటి దాక మన ఆంధ్రోళ్ళనందరినీ హైదరాబాద్ నుండి తరిమికొడతాం..ఉద్యోగాలు అందరూ ఆంధ్రాకి వెళ్లి పోవలసిందే…వారికి ఆప్షన్లు ఉండవు..ఉన్నా వారిని బయటకి గెంటేస్తాం..విద్యార్ధులకు స్కాలషిప్పులు, బస్సు పాసులు ఇవ్వము..అని బెదిరించేవారని, మన ఇళ్ళు కూలేస్తారని నువ్వే కదా చెప్పేవాడివి…

అబ్బాయ్: రాజకీయాల గురించి నీకు బాగా తెలుసు కదా బాబాయ్…టిఆర్ఎస్ వాళ్ళని వ్యతిరేకించే మీడియావాళ్ళు, ప్రతిపక్షాలవాళ్ళు అలాగా చెపుతుంటే నిజమనుకొనే వాడిని…కానీ అవన్నీ అస్సలు నిజం కాదని తెలిసిందిపుడు..

బాబాయ్: ఆహా..ఈ సంగతి నీకు ఎవరు చెప్పారేమిటి ?

అబ్బాయ్: కె.టి.ఆర్. గారు చెప్పారు…ఆ…ఆ..అయినా నాకు ఎవరో చెపితేకానీ తెలియదేమిటి? రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా మనం ఇంకా ఇక్కడే ఉండగలుగుతున్నాము అంటే వాళ్ళు ఎంత మంచోళ్ళో అర్ధం కావడంలేదు…నీకు? కేసీఆర్ గారి గురించి చెప్పనవసరమే లేదు..మన అరికాల్లో ముల్లు గుచ్చుకొంటే ఆయన గుండెల్లో గుచ్చుకొన్నట్లుటుందిట..

మొన్న మన బాలయ్య బాబు కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మన ఏఎన్.ఆర్, ఎన్టీఆర్ ల గురించి ఎంత మెచ్చుకొన్నారో తెలుసా? బాలయ్య బాబు ఏదో మాట వరసకి ‘మా ఆసుపత్రి సంగతి కాస్త చూద్దురూ..’ అని అడగగానే కేసీఆర్ గారు అప్పటికప్పుడు ఆర్డర్లు వేసేసారుట..మన బాలయ్య బాబు ఎంతగా ఇంప్రెస్ అయిపోయారంటే డిక్టేటర్ సినిమా చూడటానికి రమ్మని కేసీఆర్ గారిని ఆహ్వానించారు కూడా..తరువాత వాళ్ళు ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొంటూ తీయించుకొన్న ఫోటోలను నీకు చూపెట్టాను కదా ఆరోజు…అది చాలదు తెరాసవాళ్ళ మంచిదనం, మన మీద వాళ్ళకి ఉన్న ప్రేమాభిమానాలను అర్ధం చేసుకోవడానికి…?

బాబాయ్: అవునా..మరి ఆ మధ్య ఎప్పుడో మన ఫిలిం సిటీ భూములను వెనక్కు తీసుకొన్నారని…నాగార్జున కన్వెన్షన్ సెంటరులో అక్రమ కట్టడాలను కూల్చివేసారని చెప్పినట్లున్నావే…

అబ్బాయ్: అబ్బా…నీకెలా చెప్పాలి బాబాయ్? అక్రమ కట్టడాలని నువ్వే అంటున్నావు కదా… ఎవరో జి.హెచ్.ఎం.సి. వాళ్ళు వచ్చి కూలగొట్టి ఉంటారు…దానితో కేసీఆర్ గారికి ఏమిటి సంబంధం? కావాలంటే నాగార్జున కూడా వెళ్లి ఆయనని కలిసొస్తే మళ్ళీ కట్టుకోమని పర్మిషన్ ఇస్తారేమో?

బాబాయ్: మరి ఆంధ్రావాళ్ళ బిర్యాని పేడలాగ ఉంటుందని కేసీఆర్ ఎగతాళి చేసారని తెగ ఫీలయిపోయావు అప్పుడెప్పుడో…?

అబ్బాయ్: అబ్బా..అది కూడా మీడియా సృష్టేనట…ఆంధ్రా వాళ్ళు చాలా మర్యాదస్తులు..వాళ్ళు చేసే రొయ్యల పులుసు, చేపల కూర భలే ఉంటుంది…కొసరికొసారి వడ్డించి ఆతిద్యం ఇవ్వడంలో వారికి ఎవరూ సాటి రారు…మా పార్టీ పేరు తెలుగు రాష్ట్ర సమితిగా మార్చేసుకొని నేను భీమవరం నుండి పోటీ చేస్తానని కె.టి.ఆర్.గారు చెప్పారు తెలుసా నీకు?

బాబాయ్: అబ్బో ఈ నాలుగు రోజుల్లోనే చాలా విషయాలు తెలుసుకొన్నావే…ఇంకా ఏమి తెలుసుకొన్నావేమిటి?

అబ్బాయ్: అబ్బో చెప్పాలంటే చాలానే ఉన్నాయి..నిన్నటి మొన్నటిదాకా మన ఎన్టీఆర్ మాత్రమే యుగపురుషుడు అనుకొనేవాడినా…ఇప్పుడు అటువంటి గొప్ప వ్యక్తి ఈ లోకంలో…ఈ హైదరాబాద్ లోనే మరొకరు కూడా ఉన్నారని తెలుసుకొన్నాను.

బాబాయ్: ఓ అలాగా…ఇంతకీ ఎవరా యుగపురుషుడు?

అబ్బాయ్: అదే కేసీఆర్ గారు. యుగానికి ఒక్కరే అటువంటివారు పుడతారని కె.టి.ఆర్.గారు ఈరోజే చెప్పారు. ఆయన తన తండ్రి కనుక ఆయన గురించి అలాగ చెప్పుకొన్నారనుకోకు…ఇప్పుడు మీడియావాళ్ళు..మన ఆంధ్రా ప్రజలు అందరూ కూడా ఆయన గురించి అలాగే చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు తెలుసా?

బాబాయ్: ఓ అలాగా…

అబ్బాయ్: ఓ అలాగా…అంటే కాదు…మొన్న ఆయన అమరావతి శంఖుస్థాపనకి విజయవాడకి వెళ్ళినప్పుడు మనవాళ్ళు అందరూ ఆయనని చూసి చప్పట్లు కొట్టి ఈలలు వేసి ఆహ్వానించేరు..గుర్తుందా…అది చాలదు..ఆయన గురించి మనవాళ్ళు అందరూ ఏమనుకొంటున్నారో అర్ధం చేసుకోవడానికి..

బాబాయ్: ఏమిటి..ఈ మాట కూడా కె.టి.ఆర్. చెప్పారా నీకు?

అబ్బాయ్: ఆ…అవును..కాదు…కాదు…నాకు ముందే తెలుసు…మన వాళ్ళకి కేసీఆర్ అంటే చాలా ఇష్టమని.

బాబాయ్: ఓ అలాగా…

అబ్బాయ్: ఓ అలాగా…అంటే కాదు ఆంధ్రావాళ్ళు మా అన్నదమ్ములవంటి వాళ్ళు…అసలు ఆంధ్రావాళ్ళే మా బాసులు అని కె.టి.ఆర్. గారు చెప్పారు తెలుసా?

బాబాయ్: ఓ అలాగా…

అబ్బాయ్: అంటే నువ్వు నా మాటలు నమ్మడం లేదనిపిస్తోంది..ఈసారి జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో మన వాళ్ళకి కూడా తెరాస టికెట్లు ఇచ్చేరు తెలుసా? మనమంటే వాళ్లకి ఎంత ప్రేమ, అభిమానం లేకపోతే మనకి టికెట్లు ఇస్తారు చెప్పు? టికెట్ల కోసం పార్టీలో వాళ్లనే కాదని మనకి ఇచ్చేరంటే అర్ధం కావడం లేదు…మనమంటే వాళ్ళకి ఎంత
ప్రేమ..అభిమానమో?

బాబాయ్: మరి బాలయ్య బాబు అల్లుడు అదే…నారా లోకేష్ ఏమిటి కేసీఆర్ గురించి ఏదో చాలా డిఫరెంటుగా మాట్లాడుతున్నాడు?

అబ్బాయ్: అదంతా జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కోసమే…జస్ట్ ఎన్నికల కోసమే..చూడు లోకేష్ ప్రచారం చేస్తున్నాడు కనుక కేసీఆర్ ని, తెరాస పార్టీని ఏదో విమర్శించాలి కనుక విమర్శిస్తున్నాడు…కానీ మన చంద్రబాబు గారు కేసీఆర్ ని పల్లెత్తు మాట అన్నారా? లోకేష్ లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళందరినీ ఆకట్టుకొని ఓట్లు వేయించుకోవడానికి అలా ఉన్నవీ లేనివీ ఏదో కల్పించి చెపుతుంటారు..వాటన్నిటినీ నమ్మకూడదు. ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేయాలి పెద్దగా పట్టించుకోకూడదు…

బాబాయ్: అయితే ఇంతకీ ఏమంటావు?

అబ్బాయ్: అబ్బే ఏమీ లేదు బాబాయ్.. వాళ్ళు నాకూ టికెట్ ఇచ్చేరు…నువ్వు చెపితే మన కులపోళ్ళు…ఊరోళ్ళందరూ కాదనలేరు కదా…అందుకే మనవాళ్లందరికీ నా గురించి…మా తెరాస పార్టీ గురించి ఓ మాట చెపుతావని….

బాబాయ్: ఓ అలాగా…నీ మాట కొట్టేయడం ఎందుకని ఇప్పుడే నువ్వు చెప్పినవన్నీ కూడా ఈ చెవిలో వినేసి ఆ చెవిలో నుండి బయటకి వదిలిపెట్టేసాను రా అబ్బాయ్…నువ్వే కదా మాలాంటి వాళ్ళని ఆకట్టుకొనేందుకు ఏదేదో చెపుతుంటారని అన్నావు.

అబ్బాయ్: ఆ..ఆ…అన్యాయం…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close