భాజపా మాటలు జనం ఎందుకు నమ్మరంటే?

ఎన్నికల వేళ వస్తే పార్టీలు వరాలు కురిపించడం చాలా మామూలు విషయం. అధికారంలోకి వస్తే చేస్తాం.. అని చెప్పే వరాలకు, అధికారంలో ఉంటూ చెప్పే వరాలకు చాలా తేడా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల సమయంలో చెప్పే హామీలకు కొద్దిగా ఎక్కువ విలువ ఇస్తారు జనం. ప్రస్తుతం తెలంగాణలో అయితే.. అలాంటి ఎడ్వాంటేజీ తెరాసకు, అంతో ఇంతో భాజపాకు కూడా ఉన్నదని మామూలు ఈక్వేషన్స్‌ ప్రకారం అనుకోవాలి. అయితే విశ్లేషకులు భావిస్తున్న దాన్ని బట్టి.. భాజపా మాటలను మాత్రం జనం ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల విషయంలో ఎన్ని హామీలు ఇస్తున్నా.. ఇప్పటిదాకా మాట నిలబెట్టుకున్న చరిత్ర కేంద్రానికి లేకపోవడమే.. జనంలో భాజపా పట్ల పెరుగుతున్న అపనమ్మకానికి కారణంగా కనిపిస్తోంది.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. తెలంగాణ, ఏపీ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందునుంచి మోడీ ఈ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఎన్నెన్ని హామీలు గుప్పించారో ప్రజలు గమనించారు. కేవలం తెలంగాణ మాత్రం కాదు. అటు ఏపీలో కూడా మోడీ ఎన్ని హామీలు గుప్పించారో అందరికీ తెలుసు. అయితే గెలిచిన తర్వాత.. ఏపీని ఎలా గాలికి వదిలేశారో కూడా తెలంగాణ & ప్రజలు సైతం గమనిస్తూనే ఉన్నారు. కనీసం అమరావతి విషయంలో కూడా.. కేంద్రం వంచనను జనం చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో భాజపా మాటలను జనం నమ్మే పరిస్థితి లేదనేది అందరి భావన. ప్రస్తుతం తెలంగాణలో రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా సొంతంగా బరిలో ఉన్నది. కేంద్రంనుంచి నిధులు తీసుకువచ్చి.. నేరుగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసేస్తాం.. తమను గెలిపించండి! అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. అయితే.. వీరి మాటల పట్ల జనానికి నమ్మకం కలిగే అవకాశం మాత్రం కనిపించడం లేదు. జనం భాజపా మాటలను నమ్మడం లేదనే సంగతి వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికల విషయంలోనే తేలిపోయింది. సాక్షాత్తూ కేంద్రంలో భాగంగా కాగల ఎంపీని ఎన్నుకునే విషయంలో అక్కడినుంచి నిధులు తెస్తాం అని భాజపా చెబితే.. అక్కడి జనం ఛీకొట్టారు. ఇప్పుడు కిషన్‌రెడ్డి మళ్లీ అదే వరంగల్‌ జనం వద్దకు వెళ్లి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బైపాస్‌ చేసి నేరుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి.. వరంగల్‌ను, ఖమ్మంను డెవలప్‌ చేసేస్తాం అంటే ఎవరు నమ్ముతారు? ఇది ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారుతుందని అంతా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close