100 డేస్ : ఇప్పటికీ మాటలే.. ! ఒక్క రత్నమూ రాలలే..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచింది. ఈ వంద రోజుల్లో ఏం జరిగింది..? చాలెంజ్ చేసినట్లుగా గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెట్టిందా..? అభివృద్ధిని ట్రాక్‌పై ఎక్కించిందా..? నవరత్నాలను ప్రజలకు పంచిందా..? తెలంగాణతో స్నేహం చేస్తూ… ఏపీ ప్రయోజాలను కాపాడిందా..?. వంద రోజుల్లో ఏపీ సర్కార్ ఏం సాధించింది..?

బైబిల్, ఖురాన్, భగవద్గీతల అమలు ఎప్పటి నుండి..?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో విజయం సాధించింది. మూడు నెలల కిందట.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. నవరత్నాల అమలే అజెండా అని ప్రకటించారు. మేనిఫెస్టోను.. బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నారు. మరి మూడు నెలలు ముగిసిన తర్వాత జగన్ తన బైబిల్, ఖురాన్, భగవద్గీతను అమలు చేయడం ప్రారంభించారా….? నవరత్నాలను ప్రజలకు పంచడం ప్రారంభించారా.. అంటే కాస్త ఆలోచించాల్సి సమాధానం చెప్పాల్సిన విషయమే. ఏ ఒక్క రత్నం.. ఇప్పటికీ ప్రజలకు అందలేదు. కేబినెట్‌లో మాత్రం నిర్ణయం తీసుకున్నారు. వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ దగ్గర్నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు పది రోజుల్లో పంపిణీ చేస్తానన్న రూ. 1150 కోట్లు కూడా… వంద రోజులు గడిచినా… కార్యరూపంలోకి రాలేదు. మిగతా వాటి పరిస్థితీ అంతే.. !

అన్నీ రద్దులే.. ఒక్కటైనా కొత్త నిర్ణయం ఉందా..?

రత్నాలు, రావాల్సినవాటి సంగతి సరే..మరి ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందా.. అంటే.. రాగానే.. జగన్.. ప్రతీ ప్రాజెక్టును నిలుపుదల చేశారు. ఏపీ అంటే.. అమరావతి, పోలవరం అనుకున్న ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మూలన పడ్డాయి. ఇక చిన్నా.. చితకా.. ఇంజినీరింగ్ పనులనూ నిలిపివేశారు. ఇసుక ఆగిపోయింది. ప్రజల ఉపాధి తగ్గిపోయింది. వ్యాపారాలు పడిపోయాయి. ఫలితం… ఆంధ్రప్రదేశ్ ఆదాయంపైనే పడింది. పోలవరం, మచిలీపట్నం పోర్టు, అన్న క్యాంటీన్లు ఇలా అన్నీ రద్దుల పద్దులో చేరిపోయాయి. కానీ కొత్తవేమీ అమల్లోకి రాలేదు. పీపీఏలను సమీక్షించి… ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే.. పరారయ్యే పరిస్థితి కల్పించారు.

పొరుగు రాష్ట్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలే..!

పొరుగు రాష్ట్రంతో సన్నిహిత సబంధాలు మాత్రం… గత సర్కార్‌తో పోలిస్తే.. మెరుగుపడ్డాయి. దాని వల్ల ఏపీకి ఏమైనా ఒరిగిందా.. అంటే.. మళ్లీ ఆలోచించాల్సిందే. హైదరాబాద్ లో ఏపీ భవనాలు .. తెలంగాణ సర్కార్ కు ఇచ్చేయడం… కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి … ఆ ప్రాజెక్టుకు ఏపీ తరపున అభ్యంతరాల్లేవని సంకేతాలు పంపడం లాంటివి ఏపీ సీఎం చేశారు. కానీ.. కరెంట్ బకాయిలు.. ఉమ్మడి సంస్థల విభజన సహా… పొరుగు రాష్ట్రంతో ఉన్న పంచాయతీలు ఒక్కటీ తేల్చలేకపోయారు. పైగా పొరుగు రాష్ట్రంలోనే… ఆ రాష్ట్రంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు కడతామని బయలుదేరారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా శ్రీశైలంకు చేర్చే నీటితో… పాలమూరు – రంగారెడ్డి లో 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ ప్రకటించినా… ఏపీ సర్కార్ నోరు మెదపలేకపోతోంది. పాలమూరు – రంగారెడ్డితో సీమ ఎండిపోతుందనే భయం ప్రారంభమైనా భరోసా ఇవ్వలేకపోతోంది.

రాజకీయ ప్రత్యర్థుల వేటలో మాత్రం జోరు..!

ఒక్క విషయంలో మాత్రం… ఏపీ సర్కార్ జోరు చూపిస్తోంది. అదే.. రివెంజ్. తెలుగుదేశం పార్టీ నేతల్ని వేటాడటంలో… వైసీపీ సర్కార్ ఏ మాత్రం నిరాసక్తత చూపడం లేదు. అప్పుడెప్పుడో… దశాబ్దంన్నర కిందట.. ఓబుళాపురం మైనింగ్ విషయం పోరాడిన టీడీపీ నేతల్ని… మంచంపై ఉన్నా సరే… పట్టుబట్టి పట్టుకుపోతున్నారు. ఇక కూన రవికుమార్, చింతమనేని లాంటి నోరున్న నేతలు… ఆజ్ఞాతంలోకి పోయి… న్యాయస్థానాల శరణు కోరాల్సి వస్తోంది. ఇక గ్రామాల్లో చిన్న చితకా నేతల సంగతి చెప్పనక్కరేలేదు. టీడీపీ అలాంటి వారి కోసం పునరావాస శిబిరమే ఏర్పాటు చేసింది. వంద రోజుల్లో జగన్ సర్కార్.. ప్రజల్లో వ్యతిరేక ముద్రే వేసుకుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close