పసికందుమరణం: 100 ఎలుకల పట్టివేత, దోషులు త్వరలో!

హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రి అధికారులు ఆలస్యంగా కళ్ళు తెరిచారు. ఎలుకలు పట్టుకోవటానికి మనుషులను రంగంలోకి దించగా వారు దాదాపు 100 ఎలుకలను పట్టుకున్నారు. ఎలుకల కలుగులను మూసేయించామని, దోమలు, పురుగులను చొరబడకుండా నిరోధించటానికి అన్న కిటికీలకూ నెట్‌లు అమరుస్తున్నామని, వార్డులలో బొరియలన్నింటినీ సిమెంట్‌తో పూడ్పిస్తున్నామని అధికారులు చెప్పారు. అటు ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్ శ్రీనివాసులును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శానిటేషన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మేజిస్టీరియల్, డిపార్ట్‌మెంటల్, పోలీస్ దర్యాప్తులకు ఆదేశించింది.

మూత్రనాళ సమస్యతో పసికందును ఆసుపత్రిలో చేర్చినపుడే వార్డులో ఎలుకలు తిరగటం గమనించిన తల్లిదండ్రులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే సిబ్బంది పట్టించుకోలేదు. మరుసటిరోజు ఎలుకలు ఒళ్ళంతా కొరకటంతో పిల్లవాడు చనిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వ సిబ్బందిమీద ప్రజలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పదిరోజుల వయసు పసికందు ఎలుకలు కొరకటంతో చనిపోయిన ఘటనకు సంబంధించి దోషులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశామని, పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close