పవర్‌కట్ కారణంగా ఆక్సిజన్ అందక 14మంది రోగుల మృతి

హైదరాబాద్: గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిసిన చెన్నై నగరంలో ఇవాళ మరో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవటంతో మియట్ ఆసుపత్రిలో ఈ ఉదయం 14మంది రోగులు చనిపోయారు. వీరంతా ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న రోగులని, విద్యుత్ కొరత కారణంగా ఆక్సిజన్ సిలిండర్‌లు పనిచేయకపోవటంతో ఆక్సిజన్ అందక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో 9మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరి మృతదేహాలను రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మొత్తం 75మంది రోగులు ఐసీయూలో ఉండగా చనిపోయిన 14మంది వెంటిలేటర్‌పై ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే చనిపోయినవారి సంఖ్య 20 దాకా ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మియట్ ఆసుపత్రి మనపాక్కమ్ ప్రాంతంలో అడయార్ నది ఒడ్డునే ఉంటుంది. ఇక నగరంలో మొత్తం అన్ని ఆసుపత్రులలో కూడా ఇలాంటి సమస్య వలన మొత్తం 45మంది చనిపోయారని చెబుతున్నారు.

మరోవైపు చెన్నైలో జనజీవనం ఇంకా దుర్భరంగానే ఉంది. అయితే వర్షాలు కురవకపోవటాన్నే నగర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. వరదనీరు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నా, ఇంకా పలు కాలనీలు నీటిలోనే మునిగిఉన్నాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సౌకర్యాలు, ఏటీఎమ్‌‌లు, నిత్యావసరాల సరఫరా ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగలేదు. మొబైల్ ఏటీఎమ్ వ్యాన్‌లను రంగంలోకి దించారు. తాగునీరు, పాలు, కూరగాయలు దొరకటం దుర్లభమైపోయింది. అరలీటర్ పాల ప్యాకెట్ వందరూపాయలు పలుకుతోంది. నగరంలో 30 విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు విశేష సేవలందిస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా బాధితులను ఆదుకోటానికి వీధుల్లోకొచ్చి సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. లోకల్ ట్రైన్, బస్ సర్వీసుల పునరుద్ధరణ జరగకపోవటంతో, మెట్రో రైల్ సర్వీసులు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close