పదిహేడేళ్ల ‘ఖుషి’

* శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆనందాన్ని పంచుకున్న నిర్మాత ఎ.ఎం.రత్నం గారు సిద్దు… సిద్ధార్థ్ రాయ్… అంటూ వెండి తెరపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసి ‘ఖుషి’కి నేటితో పదిహేడేళ్లు నిండాయి. 2001 ఏప్రిల్ 27 న విడుదలైన ‘ఖుషి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువతరం ప్రేమ కథలకు, స్టైల్స్ కు ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి హుషారైన నటన, ఫైట్స్ నాటి యువతనే కాదు పెద్దవాళ్ళనీ మెప్పించాయి. శుక్రవారం నాటికి ఈ ఖుషి చిత్రం విడుదలై పదిహేడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత శ్రీ ఎ.ఎం.రత్నం గారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన కార్యాలయంలో కలిశారు. భారీ పుష్పగుచ్ఛం అందించి సంతోషాన్ని పంచుకున్నారు. ఖుషి చిత్ర అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. భూమిక కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ‘అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా…’, ‘చెలియ చెలియ..’, ‘యే మేరా జహా…’ లాంటి గీతాలు ప్రాచుర్యం పొందాయి. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే…’ అనే అలనాటి గీతం రీమిక్స్ వెర్షన్ అప్పట్లో చర్చనీయం అయింది .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close