ఫ్లాష్ బాక్‌‌: ‘ఇంద్ర‌’ స్టోరీ ఇదీ!

చిరు అభిమానులు ఇప్ప‌టికీ గ‌ర్వంగా చెప్పుకునే సినిమా ఇంద్ర‌. అప్ప‌ట్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. వ‌సూళ్ల‌లో, వంద ఆడిన సెంట‌ర్ల ప‌రంగానూ.. కొత్త అంకెలు న‌మోదు చేసింది. దాయి దాయి దామ్మ పాట‌కు చిరు వేసిన వీణ స్టెప్పు కోస‌మైతే – మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ సినిమా చూశారు జ‌నాలు. వైజ‌యంతీ మూవీస్ అందుకున్న భారీ విజ‌యాల‌లో ఇదొక‌టి. ఫ్యాక్ష‌న్ క‌థ‌ల్లో ఇంద్ర మ‌రో అరుదైన మైలు రాయి. ఇంద్ర త‌ర‌వాత‌.. మ‌ళ్లీ ఆ స్థాయిలో ఓ ఫ్యాక్ష‌న్ క‌థ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఓ ర‌కంగా ఇంద్రతోనే ఫ్యాక్ష‌న్ క‌థ‌ల వైభ‌వం, వైభోగం ఆగిపోయింది. అయితే ఇంద్ర వెనుక చాలా ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తులు.. సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. నేటితో ఇంద్ర విడుద‌లై 18 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా ఆ విష‌యాల్ని ఓసారి గుర్తు చేసుకుంటే…

* వైజ‌యంతీ మూవీస్ అంటే చిరుకి ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఓరోజు అశ్వ‌నీద‌త్‌ని పిలిచి… `క‌థ రెడీ చేసుకో..` అంటూ కాల్షీట్లు ఇచ్చేశారు చిరు. చిరు డేట్లు ఇస్తే.. అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది? అందుకే.. వెంట‌నే క‌థాన్వేష‌ణ‌లో ప‌డ్డారు అశ్వ‌నీద‌త్.

* ఈ క్ర‌మంలో చిన్నికృష్ణ చెప్పిన క‌థ అశ్వ‌నీద‌త్‌కి బాగా న‌చ్చింది. ప‌రుచూరి సోద‌రులు కూడా ఈ క‌థ‌కు ప‌చ్చ‌జెండా ఊపారు. ఆ క‌థ‌కు బి.గోపాల్ అయితే న్యాయం చేస్తాడ‌ని న‌మ్మ‌కం. ఎందుకంటే ఇదో ఫ్యాక్ష‌న్ క‌థ‌. చిరు ఇలాంటి క‌థ ఇది వ‌ర‌కు చేయ‌లేదు. ఆ క‌థ‌ల‌తో హిట్టు కొట్ట‌డం ఎలాగో బాగా నేర్చుకున్నారు బి.గోపాల్. బాల‌య్య‌తో తీసిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు చిత్రాలు రెండూ సూప‌ర్ హిట్ట‌య్యాయి. సో.. బి.గోపాల్ నే ఏకైక ఆప్ష‌న్‌.

* కానీ.. బి.గోపాల్ మాత్రం ఈ క‌థ చేయ‌డానికి అంగీక‌రించ‌లేదు. వ‌రుస‌గా ఫ్యాక్ష‌న్ క‌థ‌లే చేస్తున్నా.. అన్న‌ది ఆయ‌న ఫీలింగ్‌. పైగా చిరుతో ఇది వ‌ర‌కు చేసిన మెకానిక్ అల్లుడు సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. మ‌ళ్లీ చిరుతో ఓ త‌ప్పు చేయ‌డం త‌న‌కు ఇష్టం లేదు. మ‌రో ఫ్లాప్ ఇస్తే.. ఎప్ప‌టికీ చిరుతో మ‌రో సినిమా చేయ‌లేనేమో అనే భ‌యం ప‌ట్టుకుంది. దాంతో ఆయ‌న అశ్వ‌నీద‌త్‌నీ, పరుచూరి వాళ్ల‌ని త‌ప్పించుకుని తిర‌గ‌డం మొద‌లెట్టారుజ‌

* కానీ ప‌రుచూరి సోద‌రులు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా.. బి.గోపాల్ ని ఒప్పించారు. చిరుకి క‌థ చెప్పే బాధ్య‌త ప‌రుచూరి వాళ్లే స్వీక‌రించారు. ఫ‌స్టాఫ్ అవ్వ‌గానే చిరుకి క‌థ న‌చ్చేసింది. గో ఎహెడ్ అంటూ ఆయ‌నా ప‌చ్చ‌జెండా ఊపారు.

* నిజానికి గోదావ‌రి బ్యాక్ డ్రాప్ తో ఈ క‌థ రాసుకున్నారు. కానీ.. మార్పులు చేర్పుల్లో అది కాశీ బ్యాక్ డ్రాప్ గా మారింది.

* ఫ్యాక్ష‌న్ సినిమా అంటే భారీ డైలాగులు ఉంటాయి. ఇది వ‌ర‌కు బాల‌య్య కోసం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఇలాంటి డైలాగులు రాశారు కూడా. కానీ చిరు మాత్రం `నాకు మ‌రీ అంత హెవీ డైలాగులు వ‌ద్దు` అనేస‌రికి డైలాగుల్లో మోతాదు త‌గ్గించి రాశారు.

* ఇంద్ర ఆడియో ఫంక్ష‌న్‌లో అభిమానులంతా.. `డైలాగ్‌.. డైలాగ్‌` అంటూ అభ్య‌ర్థించ‌డం చూసిన చిరు..స‌
`ఇప్ప‌టికే 80 శాతం సినిమా పూర్త‌య్యింది. మిగిలిన 20 శాతం సినిమాల్లో భారీ డైలాగులు ఉండేలా చూడండి..` అని ప‌రుచూరి సోద‌రుల్ని అడ‌గ‌డంతో… ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ త‌మ స్టైల్‌కి దిగి సంభాష‌ణ‌లు రాసిచ్చారు.

* ఆర్తి ఆగ‌ర్వాల్ ఇంటికి వెళ్లిన చిరు `రాన‌నుకున్నారా.. రాలేన‌నుకున్నారా` అని చెప్పే సీన్ ఉంది క‌దా. నిజానికి స్క్రిప్టులో ఈ స‌న్నివేశం లేదు. షూటింగ్ అంతా పూర్త‌య్యాక‌.. రాసిన సీన్ ఇది. అప్ప‌టిక‌ప్పుడు క‌ట్ చేసిన ఈ సీన్‌ని అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు చిరుని నిద్ర‌లేపి మ‌రీ చూపించారు అశ్వ‌నీద‌త్‌.

* ముందు అనుకున్న క‌థ ప్ర‌కారం సునీల్ పాత్ర చ‌నిపోతుంది. కానీ.. క‌థానాయిక‌కు నిజం ఎవ‌రు చెప్పాలి? ఎలా తెలియాలి? అనే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల్లో మ‌ళ్లీ ఆ పాత్ర‌ని బ‌తికించారు. సునీల్ పాత్ర‌తోనే.. ఆర్తికి అస‌లు నిజం అర్థం అవుతుంది.

* ప‌రుచూరి సోద‌రులు రాసిన సంభాష‌ణ‌లు న‌చ్చ‌డంతో.. సెట్లోనే ఖ‌రీదైన సెల్ ఫోన్ ని బ‌హుమ‌తిగా అంద‌జేశారు చిరు.

* ప‌తాక స‌న్నివేశాల్లో విల‌న్ చిరు కాళ్ల‌మీద ప‌డ‌తాడు. అక్క‌డ చిరు కోసం మూడు పేజీల డైలాగులు రాశారు. విల‌న్ త‌ల వంచాక కూడా మూడు పేజీల డైలాగ్ అవ‌స‌ర‌మా? అని చిరంజీవికి సందేహం వ‌చ్చింది. దాంతో అప్ప‌టిక‌ప్పుడు ఆ మూడు పేజీల్ని కుదించి.. ఒక్క డైలాగ్ కి మార్చారు. మ‌రీ ఒక్క డైలాగా? అని చిరు ఆశ్చ‌ర్య‌పోయారు. చివ‌రికి ఆ డైలాగే మూడు పేజీల‌కు స‌రిస‌మానం అని చిరు భావించి, ఆ డైలాగ్ చెప్పేశారు. అదే.. `న‌రుక్కుంటూ పోతే అడ‌వి కూడా మిగ‌ల‌దు. చంపుకుంటూ పోతే.. మ‌నిష‌న్న‌వాడు మిగ‌ల‌డు`.

* సినిమా పూర్త‌య్యింది. మూడు గంట‌ల నిడివి వ‌చ్చింది. అంతా బాగుందంటూ మెచ్చుకున్నారు. కానీ ప‌రుచూరి సోద‌రులు మాత్రం `నిడివి ఎక్కువైంది` అని చెప్ప‌డంతో చిరు… వాళ్ల మాట‌ల‌తో ఏకీభ‌వించి.. అప్ప‌టిక‌ప్పుడు 20 నిమిషాల స‌న్నివేశాల్ని ద‌గ్గ‌రుండి ట్రిమ్ చేయించారు.

( ప‌రుచూరి గోపాల‌కృష్ణ ఇంట‌ర్వ్యూ ఆధారంగా)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close