పొన్నాల కూడా తెరాసలోకి జంప్?

మాజీ మంత్రి మరియు మాజీ తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెరాసలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఇదివరకే తెరాసలో చేరిన మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్, కె.కేశవ్ రావు ఈ విషయం గురించి ఆయనతో ఒక కాంట్రాక్టర్ ఫార్మ్ హౌస్ లో చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన రాజ్యసభ సీటు కోరగా తెరాస ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన కోడలు వైశాలికి మున్ముందు అసెంబ్లీ నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పొన్నాల కోరగా అందుకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కనుక త్వరలోనే పొన్నాల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరే అవకాశాలున్నాయి.

అయితే పొన్నాల మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండించారు. తనను పార్టీ మారే ఉద్దేశ్యం ఏదీ లేదని, కనుక పదవుల కోసం ఎవరితోనో బేరాలడుకోవలసిన అవసరం తనకు లేదని చెప్పారు. కానీ పార్టీలు మారదలచుకొన్న రాజకీయ నాయకులు అందరూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేవరకు ఇదేవిధంగా ఖండిస్తుంటారు కనుక పొన్నాల కూడా అదే చేస్తున్నట్లు అనుమానించవలసివస్తోంది. మరికొన్ని రోజులు వేచి చూస్తే ఆయన పార్టీ మారుతారో లేదో ఎలాగూ తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close