లడ్డు కోసం 2 కిలోమీటర్ల క్యూ: లాఠీఛార్జ్

హైదరాబాద్: ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి మహా లడ్డు ప్రసాదం పంపిణీ ముందు ప్రకటించినట్లే ఇవాళ ఉదయం ప్రారంభమయింది. ప్రసాదంకోసం తెల్లవారుఝామునుంచే భక్తలు పెద్దసంఖ్యలో గణేశ మంటపంవద్ద బారులు తీరారు. దాదాపు రెండు కిలోమీటర్లమేర క్యూ ఏర్పడింది. అయితే భక్తులు ఇంత పెద్దసంఖ్యలో వస్తారని ఊహించని నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో వలన అక్కడ భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. భక్తులతోపాటు అక్కడ విధులలో ఉన్న పోలీసులుకూడా ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీఛార్జి చేయాల్సివచ్చింది. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ప్రసాదంకోసం గతఏడాదికంటే ఈసారి విపరీతంగా భక్తులు వచ్చారు. కవర్లలో పంపిణీ చేస్తామని ముందు ప్రకటించిన నిర్వాహకులు అలాంటి ఏర్పాట్లేమీ చేయలేదు.

ఖైరతాబాద్‌లో భాగ్యనగర్ గణేశ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ వినాయకుడికోసం తూర్పుగోదావరిజిల్లాలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ 5,600 కేజీల లడ్డును తయారు చేసింది. విగ్రహాన్ని మొన్న నిమజ్జనం చేసిన తర్వాత లడ్డును భద్రపరిచిన నిర్వాహకులు ఇవాళ ఆ ప్రసాదాన్ని పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close