2017 Women’s Day Celebrations – Telugu Association of Greater Chicago (TAGC)

​చికాగో మార్చ్ 13 2017 : చికాగో మహా నగర తెలుగు సంస్థ , టిఏజిసి (TAGC) మహిళా దినోత్సవాన్నిచాలా ఘనంగా జరుపుకుంది. తమ మహిళా సభ్యులకు ప్రత్యేకంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమం ఒక ఉప్పెనలా వచ్చిన మహిళలతో ఉత్సవంలా సాగింది. ఈ సంబరాలకు చికాగో శివార్లలోని Arlington Heightsలోని Atlantis Banquet వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి దాదాపు 250పైగా మహిళా సభ్యులు విచ్చేసి విజయవంతం చేసారు. TAGC తమ మహిళా సభ్యుల మరియూ మహిళల ఆత్మ గౌరవాన్ని మరియు అన్ని రంగాల్లో వారు సాధిస్తున్నా అభివృద్ధిని ఎలుగెత్తి చాటేందుకు మరియూ మారుతున్న సమాజ పరిస్థితులపై స్త్రీలకు అవగాహన ఉండాలని, స్త్రీలు సమాజ అభివృద్ధిలో ముందుండాలి అని టిఏజిసి భావిస్తూ ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని చాలా గౌరవంగా జరుపుకుంటుంది.

ఈ కార్యక్రమాన్ని శ్రీమతి శిరీష రామచంద్రా రెడ్డి ఏడే, మమతా లంకల, వాణి ఏట్రింతల, హరిప్రియ గార్లు జ్యోతి వెలిగించి ప్రారంభించగా, శ్రీమతి మాధవిలతా గారి గణపతి ప్రార్ధనా గీతాన్ని ఆలపించారు.

TAGC మహిళా కమిటీ ఆధ్యక్షులు వాణి ఏట్రింతల స్వాగాతోపన్యాసముతో మొదలై & స్థానిక ప్రముఖ న్యాయవాది శ్రీమతి హరిప్రియ మెదుకుందం గారు అమెరికాలో నివసిస్తున్నా వారి కోసం ఆస్తుల భీమా మరియూ దాని ప్రాముఖ్యత గూర్చి చాలా చక్కగా వివరించారు. ఆర్ధిక స్వతంత్రం వంటి విషయాలపై సభ్యులకు అనేక సూచనలు సలహాలు అందించారు. స్త్రీలు సమాజ అభివృద్ధిలో ముందుండి నడిపించే అందులకు ఎంతో అవసరమైన శారీరక , మానసిక & ఆరోగ్య విషయాలపై సభ్యులకు సూచనలు సలహాలు అందించేందుకు ప్రత్యేకంగా మహిళా వైద్యులను ఆహ్వానించి ఆరోగ్యపరమైన విషయాలను మాట్లాడడానికి పిలిపించారు. Dr. స్మిత సురవరం గారు మంచి ఆహార అలవాట్లు & పౌష్టిక ఆహారాలు వాటి ఆవశ్యకత మరియూ వాటిని ఎలా గుర్తించి తీసుకోవాలో మహిళలకు సూచనలు అందించారు.అలాగే Dr వినీత కుంచాల మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి కాల్షియమ్ మరియు విటమిన్ డి ల అవసరాన్ని వివరిస్తూ ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనే విషయాల పై ప్రసంగించారు. TAGC తరుపున ప్రసంగికులుకు శాలువా మరియూ గ్యాపికలతో శిరీష ఏడే మరియూ మమతా లంకల గారు సన్మానించారు.

ఆట పాటలతో మహిళా దినోత్సవం ఎంతో ఉత్సాహంగా సాగింది. మానస లత్తుపల్లి గారు నేతృత్వములో ఆటలు నిర్వహించి ఆటల్లో గెలిచిన వారికీ ఈ కార్యక్రమముకోసము ప్రత్యేకముగా హైదరాబాద్ నుండి చేతితో తయారుచేసిన దారము గాజులను శ్రీమతి శిరీష ఏడే గారు బహుకరించారు. రుచికరమైన సాయంత్ర snack & రాత్రి భోజనాన్ని స్థానిక COOLMIRCHI INDIAN RESTAURANT వారు Sponsor చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను మరియూ కార్యక్రమ సభ్యత్వ రుసుములో నుండి కొంత భాగాన్ని టిఏజిసి డిజైర్ సొసైటీకి(DESIRE SOCIETY) విరాళంగా అందించింది. డిజైర్ సొసైటీ వారు భారతదేశములో ఎయిడ్స్ వ్యాధి సోకిన చిన్న పిల్లలకు మరియూ అనాధ బాలికలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుంది. టిఏజిసి మహిళా కమిటీ చైర్ వాణి ఏట్రింతల,  సభ్యులు అర్చన ప్రొద్దుటూరి, మానస లత్తుపల్లి, మమతా లంకల మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఎంతో కృషి చేసారు.

TAGC సంస్థ తరుపున వాణి ఏట్రింతల గారు ధన్యవాద ఉపన్యాసములో రిజిస్ట్రేషన్ సాఫీగా సాగేలా చూసిన మమతా లంకల గారికి, కోశాధికారి వెంకట్ గుణుకంటి, ముఖద్వారం మరియూ వేదికను అలంకరించిన శ్వేతా గట్టు, కమ్మని విందు అందించినందుకు COOLMIRCHI యజమాని అరుణ గూడూరు గారికి మరియు TAGC food committee ఉమా అవధూత గారికి & విజయ్ భీరం గారికి , ఆటలపోటీలను నిర్వహించిన మానస లత్తుపల్లి గారికి , DJ Sahil గారితో కోఆర్డినేట్ చేసిన వందన రెడ్డి లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.

టిఏజిసి అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన మహిళా కమిటీ సభ్యులకు మరియూ నిర్వహణలో తోడ్పడ్డ ప్రతి కమిటీ సభ్యులకు, వాలంటీర్ల అందరికి మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

View Event Photos Here  :  2017 Women’s Day Celebrations – TAGC

 

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close