’24’కి సీక్వెల్ వ‌స్తోందా?

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ఆక‌ట్టుకునే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. త‌న క‌థ‌లు, వాటిని తెర‌కెక్కించే ప‌ద్ధ‌తీ కొత్త‌గా ఉంటాయి. సినిమా సినిమాకీ జోన‌ర్ మారుస్తుంటాడు. ప్ర‌స్తుతానికి నాగ‌చైత‌న్య కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే త్వ‌ర‌లోనే త‌మిళ స్టార్ సూర్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. ఇది వ‌ర‌కు వీరిద్ద‌కి కాంబినేష‌న్ లో ’24’ వ‌చ్చింది. అదో సైన్స్ ఫిక్ష‌న్. కాలాన్ని వెన‌క్కి తిప్పే గ‌డియారం వ‌స్తే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది క‌థ‌. ఈసారి కూడా సూర్య కోసం వైవిధ్య‌మైన క‌థ రెడీ చేశాడ‌ట‌. ఇటీవ‌లే సూర్య‌కి కూడా వినిపించేశాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని సూర్య ధృవీక‌రించాడు. విక్ర‌మ్ త‌న‌కు ఓ క‌థ చెప్పాడ‌ని, త్వ‌ర‌లోనే ఆ సినిమాని ప‌ట్టాలెక్కిస్తామ‌ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 24కి సీక్వెలా? ప్రీక్వెలా? అనే ఆస‌క్తి నెల‌కొందిప్పుడు 24 క‌థ‌కి సీక్వెల్ చేసే అవకాశాలే పుష్క‌లంగా ఉన్నాయ‌ని టాక్‌. నాగ‌చైత‌న్య సినిమా పూర్త‌యిన త‌ర‌వాత సూర్య సినిమా మొద‌లెడ‌తార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close