ఐసిస్ లో 40 మంది భారతీయులు చేరిక!

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలని భారత్ కి కూడా విస్తరించి చాలా కాలమే అయిందని ఇదివరకే చాలాసార్లు రుజువైంది. హైదరాబాద్ కి చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు గత ఏడాది ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి నాగపూర్ నుంచి శ్రీనగర్ వెళ్లడానికి విమానం ఎక్కుతున్నప్పుడు నిఘా వర్గాల సమాచారం అందుకొని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారు ముగ్గురూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సిరియాకి భూమార్గం ద్వారా చేరుకోవాలనుకొన్నట్లు విచారణలో తేలింది. ఆ తరువాత కేంద్ర నిఘా సంస్థ అధికారులు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఐసిస్ సానుభూతిపరుల ఇళ్ళు, కార్యాలయాలపై ఆకస్మిక దాడులు అనేకమందిని అరెస్ట్ చేసారు. దాని వలన దేశంలో ఐసిస్ కార్యకలాపాలకి కళ్ళెం పడినప్పటికీ, నేటికీ అనేకమంది యువకులు, దేశవిదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నభారతీయ విద్యార్ధులు ఐసిస్ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులవుతూనే ఉన్నారు.

ఐసిస్ సంస్థ మే 19న విడుదల చేసిన 22 నిమిషాలు నిడివి గల ఒక వీడియోలో అనేకమంది యువకులు భారత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన వారుగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. వారిలో ఆంధ్రాకి చెందిన యువకుడు ఒకడు అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన వారిలో నలుగురు మహారాష్ట్రాలో కళ్యాణ్, థానే ప్రాంతాలకు చెందినవారిగా, ఇద్దరు ఉత్తర ప్రదేశ్ లోని అజాం ఘర్ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

ఇదివరకు 25మంది భారతీయ యువకులు ఐసిస్ సంస్థలో చేరగా, తాజాగా బయటపెట్టిన వీడియో ఫుటేజ్ ద్వారా వారి సంఖ్య ఇప్పుడు 40కి చేరినట్లు నిఘా అధికారులు గుర్తించారు. అంటే ఐసిస్ సంస్థ భారత్ లో చాప క్రింద నీరులా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య తీవ్రత ఇంకా పెరుగక ముందే, దాన్ని పూర్తిగా అదుపు చేయడానికి గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. పాకిస్తాన్ నుంచి దేశంలోకి చొరబడే వారిని కనిపెట్టి మట్టుబెట్టడం తేలికే కానీ ఇటువంటి ఇంటి దొంగలని పట్టుకోవడమే చాలా కష్టమైన పని. ఈ సమస్యని అరికట్టడానికి ప్రజల సహకారం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి చాలా అవసరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close