స్టీల్ ప్లాంట్ 19వేల ఎకరాలు రూ. 55 కోట్లట..!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రుణాలు పెరిగిపోవడం, ఉత్పాదకత తగ్గిపోవడమే కారణమని పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ మరోసారి చెప్పారు. ఈ సారి కూడా.. వైసీపీ సభ్యుడే ప్రత్యేకంగా ప్రశ్న వేయించి చెప్పించారు. నష్టాలు పూడ్చడానికి సీఎం జగన్ ఏడు వేల ఎకరాల సలహాలను పదే పదే ఇస్తున్నారు. ఏడు వేల ఎకరాలు ప్లాట్లుగా వేసి అమ్మేస్తే.. స్టీల్ ప్లాంట్ నష్టాలన్నీ తీరిపోతాయని అంటున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ మొత్తం భూముల విలువ రూ. 55కోట్లుగానే కేంద్రం లెక్క కట్టినట్లుగా నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మీద భూములు లేవు. రాష్ట్రపతి పేరుపై ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల కోసం భూసేకరణ చేసినప్పుడు ఇలాగే చేశారు. ఇప్పుడు..స్టీల్ ప్లాంట్‌తో పాటు భూముల్ని కూడా విలువ కట్టి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు… ఆ భూములు 19,703 ఎకరాలను రూ. 55 కోట్ల 82లక్షల రూపాయలుగా లెక్కగట్టారు. ఇదేం లెక్క అంటే.. భూసేకరణ జరిపినప్పుడు ఇదే విలువ ఉందట. ఈ కారణంగా అదే లెక్కను దాదాపు యాభై ఏళ్ల తర్వాత చూపించి అమ్మకానికి పెట్టేస్తున్నారు.   ఈ ఒక్క నిర్ణయంతోనే ఉక్కు కర్మాగారానికి సుమారు లక్ష కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లబోతోంది.

కేంద్రం నిర్ణయం కారణంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేయబోయే సంస్థకు లక్ష కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది పెద్ద స్కాంగా కార్మిక సంఘాలు అనుమానిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు విలువ కట్టే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఇదే అనుమానాలను రేకెత్తిస్తోంది. విశాఖపట్నంలో భూముల విలువ… ఎన్నో రెట్లు పెరిగింది. ఐదేళ్ల కిందట కొన్న స్థలం విలువే రెట్టింపు అవుతూంటే… యాభై ఏళ్ల కిందటి విలువలు మార్చకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇదే పద్దతిలో కేంద్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే… ప్రజలు తిరగబడటం మాత్రం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close