✍ తెలంగాణ మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న మినిస్టర్ మహేందర్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే షాక్ తగిలింది. మెజార్టీ ఉన్నప్పటికీ తాండూరు మున్సిపాలిటీ ఆయన కళ్ల ముందే కాంగ్రెస్ సొంతమైంది. చివరి నిమిషంలో కార్పొరేటర్లు ఝలక్ ఇవ్వడంతో మహేందర్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ తాండూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
? తాండూరు మున్సిపాలిటీలో రెండున్నరేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 10, ఎంఐఎం 10 వార్డులు వచ్చాయి. కాంగ్రెస్ 8, టీడీపీ 2, బీజేపీ 2 చొప్పున కౌన్సిలర్లను గెలుచుకున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలైన టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక అవగాహనకు వచ్చాయి. చైర్ పర్సన్ ఐదేళ్ల పదవీ కాలాన్ని చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకున్నాయి. టీఆర్ఎస్ వంతు పూర్తయిపోవడంతో ఇప్పుడు ఎంఐఎం టర్మ్ వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో అసలు డ్రామా జరిగింది.
? ఎంఐఎంకు మున్సిపల్ ఛైర్మన్ దక్సాల్సి ఉండగా… కాంగ్రెస్ చక్రం తిప్పింది. ఎంఐఎంలోని అసమ్మతిని తనకు అనుకూలంగా మల్చుకుంది. ఎంఐఎంకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ 8, టీడీపీ 2, బీజేపీ నుంచి ఇద్దరు తో పాటు ఎంఐఎం నుంచి ఆరుగురు కౌన్సిలర్లు చేరడంతో…. తాండూరు మున్సిపాలిటీని హస్తం గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా సంపత్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 17 ఓట్లు వస్తే… ఎంఐఎం-టీఆర్ఎస్ అభ్యర్థి 15 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
? ఊహించని పరిణామానికి మహేందర్ రెడ్డి షాకయ్యారు. సొంత సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ ఇంత పెద్ద స్కెచ్చేయడంతో ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ వీక్ అయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో… సొంత నియోజకవర్గంలోనే హస్తం ఈరేంజ్ లో షాకివ్వడంతో మహేందర్ రెడ్డిలో గుబులు మొదలైందట. . జిల్లాపై పట్టు విషయాన్ని పక్కనబెట్టి ముందు తన గెలుపు గురించి ఆలోచించుకోవాలని భావిస్తున్నారట.!!! మొత్తానికి కాంగ్రెస్ గెలుపు.. టీఆర్ఎస్ కు కనువిప్పు లాంటిదని రంగారెడ్డి జిల్లా గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.