‘అజ్ఞాతవాసి’ నేర్పిన పాఠం

ప్రేక్షకుల నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ ఒక పెద్ద సినిమా.. మాస్ ఫాలోయింగ్ వున్న హీరో సినిమా జనాకర్షణగా తీయడం అంత సులువు కాదు. కొత్తదనం వుండాలి. అన్ని వర్గాల పేక్షకులను అలరించాలి. అలాని ప్రయోగాలు పేరుతో నేల విడిచి సాము చేయకూడదు. సినిమా మనదే అన్న ఫీలింగ్ తీసుకురావాలి. కధలోనే కాదు అన్నీ విభాగంగాలో. ముఖ్యంగా మ్యూజిక్. సినిమాకి సంగీతం ప్రాణం. ఎంత పెద్ద సినిమా తీసినా.. మ్యూజిక్ యాడ్ చేయనంత వరకూ అదో ఆస్థిపంజిరం. ఎప్పుడైతే ఆ మెటిరియల్ కు సౌండ్ యాడ్ అవుతుందో.. అప్పుడే అది ప్రాణం పోసుకుటుంది. సంగీతానికి వున్న ప్రాముఖ్యత అంతస్థాయిలో ఉటుంది. అందుకే ఒక సినిమాకి సౌండ్ డిజైన్ చేసుకోవడం కధ రాసుకున్నంత కష్టం.

ఇక ఆ మ్యూజిక్ కూడా ఎలా వుండాలి ? ప్రయోగాలు పేరుతో ఎవరికీ అర్ధం కానీ స్థాయిలో వుండకూడదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు, హీరో ఇమేజ్ వున్న సినిమాలకు అస్సల్ రిస్క్ చేయకూడదు. కొత్తధనం చూపించాలి. కొత్త కొత్త సౌండ్ లు వినిపించాలి. ట్యూన్ కొత్తగా వుండాలి. అదే టైంలో ఆ ట్యూన్, శాస్త్రీయ సంగీతంలా కొందరికే పరిమితమైపోకూడదు. అలా చేస్తే ఫలితం అజ్ఞాతవాసిలా వుటుంది. అవును .. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటం, సందేహం లేదు.పవన్ కళ్యాణ్ ‘సౌండ్’ ని పట్టుకోవడంలో సంగీత దర్శకుడు అనిరుద్, సంగీతం చేయించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ ఫెయిలయ్యారు. ఇది ఒప్పుకోవాల్సిందే. అజ్ఞాతవాసిలో మొదటి పాట విన్నప్పుడే ట్యూన్ బాగున్నా పవన్ కళ్యాణ్ కి మరీ ఇంత లేత పాట అన్న ఫీలింగ్ కలిగింది. తర్వాత పాటలన్నీ వచ్చాయి. విడివిడిగావింటే బావున్నాయి. సినిమాలో చూస్తే మాత్ర ఇదేం సాంగ్రా బాబూ ? అనే ప్రశ్న తలెత్తింది చాలా మందికి.

ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ దోషం కూడా వుంది. పవన్ కళ్యాణ్, ఓ ఫారిన్ లొకేషన్ వుంటే చాలు. ఇంకేం వద్దు అన్నట్లుగా చిత్రీకరించాడు. ఈ పాటలు తెరపై చూస్తుంటే ‘త్రివిక్రమ్ కి పాట అంటే ఎంత లోకువైపోయింది’ అన్న ఫీలింగ్ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ వున్నాడనే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చిన లోకువది అనుకోవాలి. బయటికి వచ్చి, గాలి వాలుగా , ఏబీ.. ఈ పాటలన్నీ సినిమాకి సంబధం లేనట్టుగా సాగాయి. ఏవో ఆల్బం పాటలు పవన్ కళ్యాణ్ పై షూట్ చేశారు అనే ఫీలింగ్ కలిగిందేతప్పా… అవి పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ పాటలని.. కధకు తగ్గ వచ్చాయనే అనే ఫీలింగ్ ని కలిగించడంలో త్రివిక్రమ్ అనిరుద్ కలసికట్టుగా ఫెయిల్ అయ్యారు.

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పవన్ కళ్యాణ్ కి ఆయన్ని అభిమానించే లక్షాలాది ప్రేక్షకులకు ఒక సౌండ్ వేవ్ లెంత్ వుంది. పవన్ కళ్యాణ్ తెరపై కదిలే ప్రతి కదలికకు ఒక పర్టికులర్ రిధమ్ వుటుంది. కావాలంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో హీరోయిజం ఎలివేట్ అయిన సీన్స్ ను ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమాలే తీసుకుందాం. జల్సా.. ఆ బిగింగ్ సౌండ్ ఎప్పుడు వున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒకరకమైన పూనకం వచ్చేస్తుంది. ఆ సినిమా మొత్తంలో సౌండ్ ఓవర్ వెల్మింగ్. అలాగే అత్తారింటికి దారేది. సీన్స్ వైజ్ చూసుకుంటే.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. చక్కని గ్రాఫ్ మేంటైన్ చేయడం ఎంతగానో అలరిస్తుంది. ఆ సౌండ్ వింటే చాలు.. వీడియో కనిపించపోయినా ‘అది ఫలానా సీన్ కదా’ అని సగటు ప్రేక్షకుడు చెప్తాడు. కానీ ‘అజ్ఞాతవాసి’లో అలాంటి సౌండ్ థీమ్స్ నే కరువయ్యాయి.

అలాని అనిరుద్ మంచి మ్యూజిక్ చేయలేదా… అంటే చేశాడు. మనవైన సంగీత వాయిద్యాలు సితార్ వైలన్ గిటార్.. ఇంకొన్ని స్ట్రింగ్ ఎలిమెంట్స్ తో ఒక కొత్త సౌండ్ వినిపించాడు. సింథసైజర్స్ కాకుండా లైవ్ సౌండ్ రికార్డ్ చేశాడు. అయితే ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు. ముందే చెప్పుకున్నాం కదా.. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వెజ్ ఒక సౌండ్ వుందని. ఆ సౌండ్ కి అనిరుద్ ఇచ్చిన సౌండ్ అస్సల్ మ్యాచ్ కాలేదు. సినిమా విడుదలకు ముందు పాటలతో ఓకే అనిపించుకున్న అజ్ఞాతవాసి.. విడుదల తర్వాత మాత్రం.. అసలు ఇవేం పాటలు ఇవేం మ్యూజిక్ ? అనే స్థాయి వెళ్ళిందంటే తప్పు అనిరుద్ లో కాదు. త్రివిక్రమ్ ఛాయిస్ లోనే వుంది.

మరి మ్యూజిక్ విషయంలో అజ్ఞతవాసి నుండి బడా సినిమాలు ఏం నేర్చుకోవాలంటే.. గత పదేళ్ళుగా ఇండస్ట్రీ హిట్లు గా నిలిచిన సినిమాల మ్యూజిక్ ట్రాక్ లిస్టు ను పరిశీలించండి. ఎంఎం కీరవాణి, మణిశర్మ , దేవిశ్రీ ప్రసాద్, తమన్..ఈ పేర్లే కనిపిస్తాయి. హ్యారిస్ జైరాజ్, యువన్ శంకర్ రాజా.. ఇప్పుడు అనిరుద్. వీళ్ళంతా తమిళనాట క్రేజీ సంగీత దర్శకులు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని టాలీవుడ్ లో ఒక్క బడా హిట్ ఇచ్చిన దాఖలాలు కనిపించవు. లేవు కూడ.

ముందే చెప్పుకున్నాం. ఇదంతా బడా సినిమాకి సంబధించిన మ్యూజిక్ లెక్కని. మరి ఆ లెక్కలకు సరిపడా మ్యూజిక్ ఇచ్చే సత్తా ఎవరిలో వుందే వెతుక్కొని మ్యూజిక్ చేయించుకొనే బాధ్యత మన దర్శకులపై వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.