శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి!

నమస్కారములు. మా తాతయ్య గారు తెలుగు దేశం పార్టీ కి కార్యకర్త గా ఉండేవారు. ఆరోజుల్లో కార్యకర్తలు ఎంత నిబద్దతతో ఉండేవారో మీకు తెలుసు. ఆయన పార్టీ నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించింది నేను చూడలేదు. నాకు చిన్నప్పటి నుంచి అనగా 1996 నుండి మీరంటే చాలా అభిమానం. తెలుగు వాళ్ళకి కంప్యూటర్ ని పరిచయం చేసినందుకు, హైదరాబాద్ ని ఒక IT హబ్ గా చేసినందుకు, ఆఫ్రో ఆసియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ ని అత్యద్భుతంగా నిర్వహించినందుకు, జన్మభూమి, శ్రమదానం తో రాష్ట్రానికి సేవచేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు, ఇంకుడు గుంతలకు ప్రచారం కల్పించినందుకు, పచ్చదనం – పరిశుభ్రత తో మొక్కలు నాటడం, మన పరిసరాల్ని శుభ్రం చేసుకోవడం పై అవగాహన కల్పించినందుకు, నిద్రానం గా ఉన్న ప్రభుత్వ ఆఫీస్ లని, హాస్పిటల్స్ ని గాడి లో పెట్టినందుకు, రిజిస్ట్రార్ ఆఫీస్ లలో CARD నిప్రవేశపెట్టినందుకు,VISION 2020 తో స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని సాధించగలం అని భరోసా ఇచ్చి నందుకు, ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ఏం పర్వాలేదు చంద్రబాబు గారు ఉన్నారులే అనే భరోసాని ఇచ్చినందుకు, ఈ – సేవ తో గవర్మెంట్ ఆఫీస్ ల తో పనుల్ని సరళం చేసినందుకు, తెలుగువారమైన మేము మీకు చాలా ఋణ పడి ఉన్నాము.

కానీ ఈ మధ్య మాకు మీరు నచ్చడంలేదు సర్. పరిస్థితులే మిమ్మల్ని ఇలా మార్చి ఉండొచ్చు అని సరిపెట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా సగటు మనిషి ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను:

1.​ఓటుకు నోటు కేసు లో మీ ప్రమేయం ఉన్నప్పుడు – రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కదా అనుకున్నాం

2.​MRO వనజాక్షి గారిని దెందులూరు MLA ప్రభాకర్ కొట్టినప్పుడు మీరు అతని మీద ఏ చర్యలు తీసుకోకపోగా, ఇద్దరినీ కంప్రమైజ్ చేసినప్పుడు – సరే అనుకున్నాం. ప్రభాకర్ మీద ఉన్న కేసుల సంగతి అతని ప్రవర్తన గురించి మీకు తెలిసిందే.

3.​నేషనల్ మీడియా లో మీ పార్టీ కి చెందిన ఎంపీ రవీంద్ర బాబు భారత సైన్యం మీద చులకనగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. – సరే అనుకున్నాం.

4.​కుటుంబ రాజకీయాలని ప్రోత్సహిస్తారని కలలోకూడా ఊహించలేదు. కానీ మీ పుత్ర రత్నాన్ని దొడ్డి దారిలో తీసుకొచ్చిన ఏకంగా మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టి తెచ్చుకున్న తిప్పలు పడ్డది అందరికీ తెలిసిందే.

5.​మీ బావ మరిది శ్రీ బాలకృష్ణ గారి వల్ల మీ పార్టీ ఎదుర్కొన్న విమర్శలు తెలియనివి కాదు. బాలకృష్ణ- బెల్లంకొండ కేసు గురించి మీకే బాగా తెలుసు. మరి ఆయన చేతిలో రాయి ఎందుకుపెట్టినట్టు?
లోకేష్ మీ పార్టీకి గొయ్యి తవ్వితే, బాలకృష్ణ పూడ్చి పెడుతున్నారు. వీళ్ళిద్దరూ మీరు కోరి కొని తెచ్చుకున్న కష్టాలు.

6.​ఇక మీ పార్టీ నాయకుల సంగతి కి వద్దాం…సుజనా చౌదరి, నారాయణ వల్ల ఇప్పటి వరకు రాష్ట్రానికి గాని పార్టీ కి గాని జరిగిన ఉపయోగం ఏమిటి? అడ్డ దారిలో వీళ్ళని తీసుకొచ్చి ఎందుకు మా తలల మీద కూర్చోబెట్టారు. వీళ్ళని మోయడం మావల్ల కాదు.
పైన చెప్పిన విషయాల మీద మీరు పార్టీ పరువు గురించి ప్రక్కన పెట్టి కఠినం గా ఉండాల్సింది. అది మీకు వన్నె తీసుకువచ్చేది.

7. ఇక మీ విషయానికి వద్దాం. మీ రెండు కళ్ళ సిద్ధాంతం వల్ల రాష్ట్రం రెండు ముక్కలవ్వడం నిజం కాదా ?

ఎన్నికల విజయం కోసం కాపులకి రిజర్వేషన్స్ విషయాన్ని లేవనెత్తి కొరివితో తలగోక్కోవడం వల్ల మీరు సాధించిందేంటి? ఆ అంశంలో తప్పు ముమ్మాటికీ మీది కాదా? దీని వలన భవిష్యత్ లో కులాల మధ్య కుంపటి పెట్టినవారవుతారు.

రాజధాని కట్టుకోవడం అనివార్యం అత్యవసరం. దానిని కాదన్న వాడు మూర్కుడి తో సమానం. రాజధాని చుట్టూ పక్కల మీ పార్టీ వారితో ముందుగా భూములు కొనిపించడం, రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల నిధులను ఖర్చు చేస్తే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం నుండి రీజనబుల్‌గానే ఏపీ రాష్ట్రానికి నిధులు వచ్చాయిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటి?

ఇక ప్రత్యేక హోదా అవసరం లేదు అని మీరు ఆనాడు చెప్పలేదా? హోదా పేరుతో ఉద్యమాలు చేస్తే జైళ్ళకి పంపిస్తామని మీరు చెప్పలేదా? విశాఖపట్నంలో ఉద్యమం మొదలుపెట్టబోతే వారిని అరెస్ట్ చేయించలేదా? మరి ఇప్పటి వరకు దృతరాష్ట్రుడిగా కాలం వెళ్లదీస్తూ. సరిగ్గా ఒక్క సంవత్సరం ముందు నిద్ర లేచి ప్రత్యేక హోదా పాట ఎందుకు పాడుతున్నట్టు…

పవన్ కళ్యాణ్ మీమీద, తెలుగు న్యూస్ చానెల్స్ దిగ్గజాల మీద, మీ పుత్రరత్నం మీద, వారి స్నేహితుల మీద చేసిన ఆరోపణలు నిజం కాదా? ఒకవేళ అబద్దమే అనుకుందాం. పవన్ కళ్యాణ్ నామజపం 24×7 చేస్తూ TRP ని రేస్ గుర్రం లా పరిగెత్తించిన చానెల్స్.. 20 ఏప్రిల్ రోజున ఒక్క నిమిషం కూడా లైవ్ టెలికాస్ట్ ఎందుకు చేయలేదు? సుదీర్ఘంగా 12 గంటలు మీ దీక్షని మాత్రమే కవర్ చేస్తూ మిగితా విషయాలని కవర్ అప్ చేయడం కోసమేనా? దీంతో నైతిక విజయం పవన్ కళ్యాణ్ కే దక్కింది.

తెరవెనుక వ్యక్తులు ఎవరో ఏమిటో మాలాంటి సామాన్యులకి తెలియడానికి ఆస్కారమే లేదు. కానీ దీనిలో మీ హస్తం నిజంగా ఉంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని ముమ్మాటికీ క్షమించరు. పవన్ గురించి ఒక్క నిమిషం కూడా కేటాయించకపోవడం వల్ల మీడియా చేతనే తెలుగుదేశం పార్టీకి గొయ్యి తవ్వించారు. మీరు పవన్ కళ్యాణ్ కి జరిగిన అన్యాయాన్ని ఖండించవలసింది. ఎంతైనా మీకు ఎన్నికల్లో అండగా నిలచిన వ్యక్తి కదా. గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ మీద జనాలు సంతృప్తి గా లేరన్నది మీకు తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న విషయాల వల్ల తెలుగుదేశం పార్టీ ఖ్యాతి పాతాళానికి పడిపోయింది. మీదీక్ష పూర్తిగా హంగు ఆర్భాటాలతో నిండింది.

“ఎవరినీ వ్యక్తిగతం గా టార్గెట్ చేయకపోవడం లేక చేయించక పోవడం అందరికీ మంచిది.”
“ఖర్చుపెట్టి చేయించే నెగటివ్ పబ్లిసిటీ కన్నా అభివృద్ధి చేసి చూపిస్తే మీకు వచ్చే పాజిటివ్ టాక్ చాలా శక్తివంతమైనది”

ఇప్పటి నీచ రాజకీయాలని మార్చాలని అనుకుంటున్నాం.

మీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఎవరికి ఓటు వేయమంటారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారూ??????

ఇక సెలవ్

మీ నానా పాటేకర్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close