చంద్రబాబుకు గుడి

హైదరాబాద్: తమిళనాడులో సినిమా తారలకు గుడి కట్టటం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాము. ఎంజీఆర్‌కు, హీరోయిన్‌లు కుష్బూ, నమితకు అక్కడ గుడికట్టిన అభిమానులు ఉన్నారు. రాజకీయ నాయకులకు గుడులు కట్టటం అరుదు. ఆ మధ్య వైఎస్‌కు గుడికట్టినట్లు వార్త వచ్చింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడికి గుజరాత్‌లో ఓ వీరాభిమాని గుడికట్టాడని అన్నారు. మహాత్మాగాంధికి నల్గొండజిల్లా చిట్యాలలో గుడి ఉంది. అదేకోవలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకుకూడా గుడి నిర్మిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో – గుంటూరుజిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో బాబుకు గుడికట్టాలని రాజధాని రైతులు నిర్ణయించారు. దీనికి ఈనెల 22న శంకుస్థాపన చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులందరూ వస్తారని తెలుస్తోంది. తమ గ్రామాన్ని రాజధానిగా చేసిన చంద్రబాబును దేవుడిలా భావిస్తున్నామని గ్రామ రైతులు చెప్పారు. ఇందుకు బాబుకు జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. అందుకే గుడి కట్టాలని నిర్ణయించామని రైతులు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close