రివ్యూ : ‘ఆటాడుకుందాం..రా’ ఆట లో జోష్ లేదు

‘కాళిదాసు’, ‘కరెంట్‌’, ‘అడ్డా’ వంటి చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల్లోను, అక్కినేని అభిమానుల్లోనూ ఎంతో పేరు తెచ్చు కున్నాడు సుశాంత్‌ .కామెడీ చిత్రాలను తనదైన స్టైల్ లో మెప్పించిన దర్శకుడు జి .నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నమర్పణలో, శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ సంయుక్తంగా, చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, నిర్మించిన ‘ఆటాడుకుందాం…రా’ కామెడీ ఎంటర్‌టైనర్‌తో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు.పబ్లిసిటీ పరంగా మంచి అంచనాలనే రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందీ? రివ్యూ ద్వారా తెలుసుకుందాం…రండి..

కథ :
కథ లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) మంచి స్నేహితులు. ఆనంద్ ఇచ్చే సలహాలతో వ్యాపారంలో విజయరామ్ కోట్లు గడిస్తాడు. అయితే విజయరామ్‌కు శత్రువైన శాంతారామ్ (ఫిరోజ్‌ అబ్బాసి) అతడి సక్సెస్‌ను చూసి తట్టుకోలేక దొంగ దెబ్బతీస్తాడు. దాంతో విజయ రామ్ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ పరిస్థితి కి కారణం శాంతారామ్ చేసిన మోసం ఆనంద్‌పై పడుతుంది. తాను నమ్ముకున్న స్నేహితుడే మోసం చేసాడనే కోపం తో ఆనంద్ ప్రసాద్ ని దూరం చేసుకుంటాడు విజయ రామ్. ప్రస్తుతానికి వస్తే, విజయరామ్‌కి అతడి చెల్లెలన్నా, ఆ కుటుంబం అన్నా నచ్చదు కానీ, తనకున్న రైస్ మిల్ అమ్మకానికి చెల్లెలు సంతకం అవసరమౌతుంది. ఆమె కొడుకైన కార్తీక్ (సుశాంత్)కి జి పి ఏ చేయించి, అమెరికా నుంచి ఇండియాకు పంపిస్తుంది కట్ చేస్తే…కార్తీక్ విజయ రామ్ మేనల్లుడు కాదని ఒకానొక సందర్భం లో తెలిసి పోతుంది. సుశాంత్ ప్రియురాలు శృతి (సోనమ్ భజ్వా) అతనికి సహకరిష్తుంది. ఆలా కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడూ? ఇంతకీ విజయరామ్‌ మేనల్లుడు ఎవరు? కార్తీక్ మేనల్లుడిగా నటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :
హీరో సుశాంత్ జస్ట్ చిల్ అంటూ సరదాగా సాగిపోయే పాత్రలో బాగానే నటించాడు. కమర్షియల్ హీరో చేసే డ్యాన్సులు, ఫైట్స్.. అన్నీ చేయగలనని సుశాంత్ ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. డబ్బింగ్ విషయం లో ఇంకా మెళకువలు నేర్చుకోవాలి.ఇక హీరోయిన్ సోనమ్ భజ్వా పాటల్లో తన అందాలను ప్రదర్శన చేసింది. నటన పరంగా చెప్పుకోడానికి ఏమి లేదు. పోసాని కృష్ణమురళి ‘ఫ్రెండు’ అంటూ చేసిన కామెడీ ఫర్వాలేదనేలా ఉంది. టివి డైరెక్టర్ గా పృథ్వీరాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెల్ని అంటూ వచ్చే ఝాన్సీ కామెడీ ఆకట్టుకుంది. కథతో ఏమాత్రం సంబంధం లేకున్నా టైమ్ మెషీన్ నేపథ్యంలో వచ్చే ఎలాంటి లాజిక్స్ లేని కామెడీ సన్నివేశాలలో సుశాంత్, జానకి రామ్ పాత్రలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లు సన్నివేశాలను రక్తి కట్టించారు. ఆటాడుకుందాం..రా సాంగ్ లో ఫ్లాష్ డాన్సర్ గా అఖిల్, కథ పరంగా కనెక్ట్అయ్యి మెరిసిన నాగ చైతన్య లు బాగా ఆకట్టు కున్నారు. అజయ్ శర్మ, విలన్ ఫిరోజ్‌ అబ్బాసి తమ తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం :
దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి గత చిత్రాలను పోల్చుకుని చూస్తే ఈ చిత్రం అతని ఛాయలు ఏమి కనపడలేదు .ఒక కామెడీ సినిమా నుండి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అవేవీ లేకుండా ఒక నీరసమైన కథ, కథనాలతో అర్ధం పర్ధం లేని లాజిక్స్ తో నిరాశ పరిచాడు. మంచి బడ్జెట్ పెట్టె నిర్మాతలు వున్నా చాలా సార్లు వచ్చిన నీరసమైన కథతోనే అక్కడక్కడా నవ్వించినా, ఓవరాల్‌గా ఈ సారి ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. శ్రీధర్‌ సీపాన రాసిన మాటలు ఏ మాత్రం పదునుగా లేవు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సాదాసీదాగా ఉన్నాయి. అతని ట్యూన్స్ మళ్ళి మళ్ళి వినిపించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోలేదు. ఆర్ట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పనితనం బాగుంది. సినిమా అంతా రిచ్‌గా సినిమాటోగ్రఫీ పనితనం కూడా బాగానే ఉపయోగపడిందని చెప్పొచ్చు. నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాణపు విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :
ఈ సినిమాకు ఉన్నంతలో మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫస్టాఫ్‌లో టివి డైరెక్టర్ గా పృథ్వీ, సుశాంత్‌ల మధ్యన వచ్చే కామెడీ అని చెప్పుకోవాలి. కథతో ఏమాత్రం సంబంధం లేకున్నా టైమ్ మెషీన్ నేపథ్యంలో వచ్చే కామెడీ అక్కడక్కడా నవ్వించింది. కథ గా చూసుకుంటే తెలుగు సినిమాలో ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన పక్కా ఫార్ములా కథను ఎంచుకోవడమే మైనస్ పాయింట్. దానికితోడు ఈ ఫార్ములా కథనైనా సరిగ్గా డీల్ చేయలేక పోవడం దర్శకుడి లోటు కనపడుతుంది. ఫస్టాఫ్‌లో కొంత మేర కథ కనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి ఎక్కడా కథే లేదు. ఇక కథ తో సంబంధం లేకుండా సెకండ్ హాఫ్ స్టార్ట్ నుండి క్లైమాక్స్ వరకూ టైమ్ మెషీన్ అంటూ, చీటింగ్ అంటూ, వందల కోట్ల వ్యవహారం తో, విజయరామ్ కుటుంబం ఎలా కుదుట పడిందో అర్థం లేని సన్నివేశాలతో నడిపించుకుంటూ వచ్చారు. సిసింద్రీ చిత్రం లో ‘ఆటాడుకుందాం..రా’ అనే హిట్ సాంగ్ పల్లవి బాగుంది అని టైటిల్ పెట్టారు. కానీ వాళ్ళు పిలిచారు కదా అని మనం ఉత్సాహం గా వెళితే…ఆట నిరుత్సహపెడుతుంది..ఆట లో ఉండాల్సిన జోష్ లేదు.

తెలుగు360.కామ్ రేటింగ్ – 1.5/5
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్‌
బ్యానర్స్ : శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ సంయుక్తంగా….
నటి నటులు : సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాసి, హర్ష, సుధ, ఆనంద్‌, రమాప్రభ, రజిత, హరీష్‌ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర,
ఎడిటింగ్‌: గౌతంరాజు,
ఆర్ట్‌: నారాయణరెడ్డి,
ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర,
కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన,
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల,
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close