నాయ‌కి, అభినేత్రి ఒక్కటేనా?

హార‌ర్ ద్రిల్లర్ల జాబితాలో మ‌రో సినిమా వ‌స్తోంది… అదే అభినేత్రి. ప్రభుదేవా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ దర్శకుడు. అభినేత్రికి సంబంధించి రెండు టీజ‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఒక‌దాంట్లో ప్రభుదేవా క్లాసీ స్టెప్పులతో అద‌ర‌గొడితే మ‌రో టీజ‌ర్‌లో త‌మ‌న్నా రెచ్చిపోయి చిందులేసింది. ఈ రెండు టీజర్లతో ఈసినిమాకి కావ‌ల్సినంత హైప్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ట్రైలర్ చూస్తుంటే క‌థ చూచాయిగా తెలిసిపోతోంది. క‌థానాయిక కావాల‌నుకొని ప‌ల్లెటూరు నుంచి ప‌ట్నం వ‌చ్చిన త‌మ‌న్నా… సోనూసూద్ చేతిలో మోస‌పోయి ఆత్మహత్య చేసుకొంటుంది.

త‌నే దెయ్యంలా మారి ప‌గ తీర్చుకొంటుంది, అదెలా అన్నది తెర‌పై చూడాలి. బేసిక్ ఫ్లాట్ వింటుంటే.. ఇది వ‌ర‌కు వ‌చ్చిన నాయ‌కి సినిమా గుర్తొస్తోంది. త్రిష క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా కథ కూడా ఇంచుమించు ఒక‌టే. నాయ‌కి, అభినేత్రి.. ఇలా పేర్లు కూడా క‌ల‌సిపోయాయి. మ‌రి.. ఈ రెండు క‌థ‌లూ దాదాపుగా ఒకేలా ఉన్నా… టేకింగ్ ప‌రంగా తేడాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. అభినేత్రి చాలా లావీష్‌గా క‌నిపిస్తోంది. ప్రభుదేవా ఎప్పుడూ చేయ‌ని డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపిస్తున్నాడు. ట్రైలర్ కూడా నీట్‌గానే క‌త్తిరించారు. మూడు భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కించ‌డం వ‌ల్ల‌, మూడు చోట్లా త‌మ‌న్నా తెలిసి ఉండ‌డం వ‌ల్ల‌.. బడ్జెట్ ప‌రంగా, మార్కెట్ ప‌రంగా వెసులుబాటు దొరుకుతుంది. త‌మ‌న్నా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్బ్ గా ఉంది. టోట‌ల్‌గా.. అభినేత్రిలో హిట్టు కొట్టే లక్షణాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి… ఈ అంచ‌నాల్ని అందుకొంటుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close