నిఖిల్ సినిమాను కొనేసిన అభిషేక్ పిక్చర్స్

ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ రంగంలో తమ హవా కొనసాగిస్తున్నారు అభిషేక్ పిక్చర్స్ వారు. స్టార్ హీరోల సినిమాలనే కాదు కృష్ణగాడి వీర ప్రేమగాథ, కళ్యాణ వైభోగమే ఇంకా సుప్రీం చిన్న సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఆ దారిలోనే అభిషేక్ వారు ఇప్పుడు మరో స్పెషల్ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు.

నిఖిల్ హీరోగా ‘టైగర్’ ఫేం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను అభిషేక్ పిక్చర్స్ టోటల్ రైట్స్ దక్కించుకున్నారట. అభిరుచి గల సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోల్లో తన సత్తా చాటుతున్న నిఖిల్ ఎన్నో భారీ అంచనాలతో తీసిన ‘శంకరాభరణం’ అపజయపాలైనా చేస్తున్న సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అయితే విశేషం ఏంటంటే సినిమా కేవలం సగం షూటింగ్ మాత్రమే చేసుకున్నా కథ కథనాల మీద నమ్మకంతో అభిషేక్ పిక్చర్స్ సినిమాను కొనేశారట.

మరి చూస్తుంటే నిఖిల్ కూడా నానిలా తన ఖాతాలో బంపర్ హిట్ వేసుకునేలానే ఉన్నాడు. హెభా పటేల్, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి రావాలని ఆశిస్తున్నాడు నిఖిల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close