ఎబిఎన్ రాధాకృష్ణ మళ్ళీ హితోపదేశం: ఈ సారి “క్లాస్” సినీ ఇండస్ట్రీకి

నంది అవార్డుల రగడ కొనసాగుతుండటం తో , ఎబిఎన్ ఛానెల్ రాధా కృష్ణ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నడుం బిగించినట్టున్నారు. ఇండస్ట్రీ నుంచి సంభందిత వ్యక్తులందరినీ ఒకచోట కూర్చోబెట్టి డిబేట్ చేసారు. బహుశా ఈ ప్రోగ్రాం ద్వారా అందరి వాదనలూ విని ఒక నిష్పక్షపాతమైన చర్చ జరిపి సమస్య మూలాలు చర్చించి, భవిష్యత్తు లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఒక నిర్దిష్ట సలహాలు సూచనలు రూపొందిస్తారని ప్రేక్షకులు భావించారు. కానీ చివరికి మళ్ళీ ఇది కూడా ఈ మధ్య రాధాకృష్ణ చేస్తున్న హితోపదేశాల్లాగే ఇది కూడా సంబంధిత వ్యక్తులకి “క్లాస్” పీకే ప్రోగ్రాం గా మిగిలిపోయింది.

ఎబిఎన్ రాధా కృష్ణ కూడా ఈ డిబేట్ లో పాల్గొన్నారు. డిబేట్ లో ప్రయోక్త పాత్ర పోషిస్తూ, ఆయా వ్యక్తుల మధ్య డిస్కషన్ “ఫెసిలిటేట్” చేయడం మాత్రమే కాదు, తాను కూడా డిబేట్ లో పార్టిసిపెంట్ వలే వ్యవహరించి తన అభిప్రాయాలు “బలంగా” వినిపించారు రాధా కృష్ణ . మొత్తానికి ఆ ప్రోగ్రాం ద్వారా ఆయన చెప్పిన హితోపదేశం లోని ముఖ్యాంశాలు ఇవీ –

  • – మీరు ఆరోపణలు చేసేటపుడు జ్యూరీ కి మాత్రమే వాటిని పరిమితం చేయాలి. ప్రభుత్వానికి వీటిని ఆపాదించవద్దు. (అయితే ఆ జ్యూరీ ని నియమించేది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వానికి పరోక్ష బాధ్యత ఉంటుందనే వాదన ని రాధాకృష్ణ పెద్దగా ఫోకస్ చేయలేదు)
  • – ప్రభుత్వం దీని (నంది అవార్డుల రగడ) మీద సీరియస్ గా ఉంది. అవసరమైతే నంది అవార్డులు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. (ఇది కూడా సబబు కాదు. మేము అవార్డులు ఇచ్చినట్టు తీసుకుంటే సరి, లేదంటే మొత్తానికే రద్దు చేస్తాం అనే వాదన ప్రభుత్వం నుంచి రావడం సమంజసమేనా )
  • – అప్పుల్లో ఉన్న రాష్ట్రం అయినప్పటికీ ఎపి నంది అవార్డులు ప్రకటించింది. అది సినీ ఇండస్ట్రీ గుర్తించాలి. (నంది అవార్డుల ద్వారా ఇచ్చే మొత్తం ప్రభుత్వానికి భారం అని చెప్పడం ప్రభుత్వం మీద కాస్త సింపతీ తెచ్చుకునే ప్రయత్నం తప్ప మరేమీ కాదు. వేర్వేరు అవార్డులకి గానూ ఇచ్చే క్యాష్ అవార్డ్ 15,000 నుంచి 1,20,000 వరకూ ఉంటుంది మొత్తం అన్ని అవార్డులకీ కలిపి ఇచ్చే క్యాష్ 14 లక్షల లోపే. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం సింధువు లో బిందువు. దాన్ని కూడా భారం గా చెపుకోవడం ప్రభుత్వానికి ఎంత వరకు సమంజసం)
  • – అవార్డులు అందుకున్న వారు కానీ, విమర్శలు చేస్తున్న వారు కానీ ఎవరికీ ఎపి లో ఓటు హక్కు లేదు. వీళ్ళంతా ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు. ( ఎపి లో ఓటూ హక్కు కి నంది అవార్డులకీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం తెలుగు సినిమాలనే హోదా తో ఎపి నంది అవార్డులని ఇస్తోంది. ఒకవేళ భవిష్యత్తు లో ఎపి లో ఇండస్ట్రీ ని అభివృద్ది చేయాలనుకుంటే, ఎపిలో తీసిన సినిమాల కి మాత్రమే నంది ఇచ్చేలా నంది గైడ్ లైన్స్ నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు. కానీ అప్పటిదాకా మాత్రం ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారమే అవార్డులు ఇవ్వాల్సి ఉంటుంది)

అయితే మొత్తం డిబేట్ నంది గురించి ప్రభుత్వాన్ని సమర్థించడానికి, ఇలా రగడ చేయడం ద్వారా సినీ పరిశ్రమకే నష్టం అని ప్రూవ్ చేయడానికి, నిరసన చేస్తున్న వారికి క్లాస్ పీకడానికి రాధాకృష్ణ ఈ డిబేట్ ఉపయోగించుకున్నట్టు అనిపించింది చూసిన ప్రేక్షకులకి !!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.