ఆంధ్రజ్యోతి అగ్నిప్రమాదం…..అతికి పరాకాష్టగా లేదూ?

ఒక నాయకుడిని విమర్శించాలన్నా, భజన చేయాలన్నా ఆంధ్రజ్యోతి తర్వాతే ఎవరైనా. వైఎస్ జగన్‌ జీవితానికి సంబంధించి ఆంధ్రజ్యోతి విమర్శించని విషయం అంటూ ఏమీ మిగలలేదు. అలాగే ఆ మధ్య గవర్నర్ నరసింహన్‌పైన ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ఆయనపైన విమర్శల తుఫాన్ కురిపించారు. ఇక చంద్రబాబు, లోకేష్‌లను ఆకాశానికి ఎత్తడంలో జ్యోతిది అందె వేసిన చేయి. చంద్రబాబుకు మోడీ బాగా ముద్దొచ్చిన 2014 ఎన్నికల సమయంలో మోడీని కూడా అదే స్థాయిలో పొగిడేశారు. అక్కడ తేడారాగానే తెగడ్తలు కూడా అదే స్థాయిలో ప్రచురించారు. ఇలా నాయకుల విషయంలో అనుసరించిన సూత్రాన్నే ఇప్పుడు సొంత పార్టీ విషయంలో కూడా ఫాలో అవుతోంది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి విమర్శల రుచి ఎలా ఉంటుందో తెలుగు నాయకులందరికీ తెలుసు కాబట్టి పోలోమని అందరూ ఓదార్పుయాత్రని చేపట్టారు. ఓదార్పు యాత్రకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్‌కి రాధాకృష్ణను ఓదార్చే అవకాశం లేదనుకోండి. అఫ్కోర్స్….సాక్షి ఆఫీసులో ఇలాంటి సంఘటనే జరిగితే ఇప్పుడు పరామర్శిస్తున్న వాళ్ళలో ఒక్కరు కూడా ఓదార్పు యాత్ర చేపట్టరు అన్న మాట వాస్తవం.

ఆశ్ఛర్యం, హ్యాట్సాఫ్, దిగ్భ్రాంతి, ఆవేదన, విచారం, చలించి పోవడం….ఇలా సాగింది ఆంధ్రజ్యోతి వారి ప్రచురణ. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఆఫీసుని చూసిన వివిధ పార్టీల నాయకులు స్పందించిన విధానం గురించి ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలో కనిపించిన పదాలు అవి. ఆయా పార్టీల నాయకులందరూ కూడా ఆంధ్రజ్యోతి వారిని పరామర్శిస్తున్న తీరే జ్యోతి పత్రిక ఎవరి ప్రాధాన్యాల కోసం పనిచేస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు సుస్పష్టంగా తెలియచేస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి వారి అతి మాత్రం విమర్శలు కొని తెచ్చుకునేలా సాగుతోంది. అయినా ఈ నాయకులందరూ కూడా మొదటి సారి అగ్ని ప్రమాదాన్ని చూస్తున్నారా? పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోయినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ప్రచారం లభించిందా? నాయకులు ఈ స్థాయిలో స్పందించారా? అంతా కూడా క్విడ్ ప్రో ఖో వ్యవహారం కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో స్పందిస్తున్నారని ఎందుకు అనుమానించకూడదు. ప్రెస్ వాళ్ళపైన అంత ప్రేమ ఉన్నవాళ్ళు అయితే ఎందుకు మీడియాపైన విరుచుకు పడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కూడా ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ప్రజల కోసం పనిచేస్తున్న మీడియా సంస్థలకు కూడా ఇలాంటి ప్రమాదం ఎదురైతే ఇదే స్థాయి స్పందన ఉంటుందా? చీరాల ఎమ్మెల్యే తమ్ముడు ఒక జర్నిలిస్టుని చచ్చేలా కొట్టినప్పుడు వీళ్ళెవ్వరికీ పరామర్శించాలన్న విషయం గుర్తురాలేదా? కనీసం నిందితులపైన చర్యలు అన్నా తీసుకున్నారా? పత్రికా స్వేఛ్ఛ విషయంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల స్థాయికి ఇండియాను దిగజార్చిన నాయకులు భజన మీడియాకు మాత్రం అన్ని విధాలా ఆదుకుంటాం, అన్ని ప్రయోజనాలూ కల్పిస్తాం అన్న భరోసా ఇస్తున్నారా? అంటే ప్రెస్ ఫ్రీడంని చంపేసి భజన చేసే మీడియాను మాత్రం బ్రతికించాలనుకుంటున్నారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close