ఉత్తరాంధ్ర ప్రజల హిందీ పైన ఎబిఎన్ రాధా కృష్ణ అనుచిత వ్యాఖ్యలపై వివాదం

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అధినేత రాధాకృష్ణ వ్యాఖ్యల కారణంగా విమర్శల పాలవుతున్నారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన విద్యావేత్తలు మేధావుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే

ఏబీఎన్ రాధాకృష్ణ ఈమధ్య, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా, ఎంపీ గారు హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగిన విధానాన్ని మెచ్చుకుంటూ, ” మీ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పొట్ట పొడిస్తే ఒక్క అక్షరం ముక్క హిందీ రాదు కదా, మీరెలా అంత అనర్గళంగా హిందీ మాట్లాడగలుగుతున్నారు” అని ప్రశ్నించాడు. దానికి ఎంపి గారు కూడా సమాధానమిచ్చారు తప్పితే, తమ శ్రీకాకుళ వాసులని రాధాకృష్ణ కించపరిచినట్టు ఆయనకు అనిపించలేదు. అయితే, ఆ వ్యాఖ్యలపై శ్రీకాకుళ వాసులు మండిపడ్డారు. కొన్ని పత్రికలలో రాధాకృష్ణ వైఖరిని ఎండగడుతూ వ్యాసాలు కూడా వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా, ఆ వ్యాఖ్యలు ఉద్దేశించి చేసినవి కాదంటూ ఖండన ప్రకటన విడుదల చేసింది.

ఇక దీనిపై స్పందించారు పవన్ కళ్యాణ్. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించిన వ్యాఖ్య ఏమిటంటే, ” మనదేశ యాస భాషలని అగౌరవపరచి , అపహాస్యం చేస్తేనే అది తెలంగాణ ప్రజల కోపానికి, రాష్ట్ర విభజన కి, కారణమైంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని సహజ వనరులు ఉండి కూడా వెనుకబాటుతనానికి గురవుతున్నారు. నాయకులు బాగు పడుతున్నారు కానీ ప్రజలు బాగు పడట్లేదు. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్ర భాష ఈ ఆశలని అపహాస్యం చేయడం తగదు”. ఇది స్థూలంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ లోని సారాంశం.

ఒక పత్రిక అధినేత స్థాయి వ్యక్తులు, మిగతా వారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి శ్రీకాకుళ యాసను కించపరిచిన ప్రతిసారి, శ్రీకాకుళం ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకుని వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి, ఆ ప్రాంత ప్రజలు తమ ఆవేదన వెళ్లగక్కుతూనే ఉన్నారు. గతంలో కేరింత అనే సినిమాలో శ్రీకాకుళం యాస ఉపయోగించి హాస్యం పండించడానికి చేసిన ప్రయత్నాలు శ్రీకాకుళం వాసుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కొన్నాయి. దిల్ రాజు కారు ని శ్రీకాకుళ వాసులు అడ్డగించేంత వరకు పరిస్థితులు వెళ్లాయి. అలాగే 2009 ఎన్నికల సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రచారంలో బొత్స సత్యనారాయణ ని ఉద్దేశించి, ఆయన అవినీతిపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా కూడా ఎన్టీఆర్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బొత్స అవినీతిని ఎన్టీఆర్ ప్రస్తావించి చేసిన విమర్శలు అన్నింటికీ శ్రీకాకుళం ప్రజల నుంచి మంచి మద్దతు లభించినప్పటికీ, ఆ ఉపన్యాసంలో ఒకానొక సమయంలో, ” బొత్స గారు అవినీతి అంతా చేసి, చివరికి ‘ నానేటి సేసాను ‘ అంటూ బుకాయిస్తారు” అని ఎన్టీఆర్ ఉపన్యాసంలో అన్నారు. అయితే బొత్స ను అనుకరిస్తూ శ్రీకాకుళం యాస లో ఆయన చేసిన విమర్శలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, తన మీదకే రివర్స్ అయి, శ్రీకాకుళం ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఖరికి ఎన్టీఆర్ స్వయానా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భాష, యాస, ఆత్మగౌరవం వంటి విషయాలలో ప్రజలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంత ప్రజలు మరింత సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి వారి మనోభావాలను దెబ్బతీసేలా చేసే ప్రతి చిన్న వ్యాఖ్య కూడా ఎక్కువగానే హైలెట్ అవుతుంది. మీడియా అధినేత స్థాయిలో ఉంటూ అందరికీ సుద్దులు చెప్పే పెద్దలకు, ఇంత చిన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరం.

ఇక ఇదే తరహా వ్యాఖ్యలు మీడియాకు సంబంధించిన వ్యక్తులు కాకుండా బయటి వారు ఎవరైనా చేసి ఉంటే, ఇదే మీడియా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ చేత క్షమాపణ చెప్పించేంత వరకు వదిలిపెట్టి ఉండేది కాదు అనడం లో సందేహం లేదు. చిన్న కమెడియన్లు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక చిన్న మాట అన్నప్పుడు దాని మీద పెద్ద పెద్ద డిబేట్ లు పెట్టే చానళ్లు, మీడియాకు సంబంధించిన వ్యక్తులు నోరు జారినప్పుడు మాత్రం అన్ని చానల్స్ వారు వ్యూహాత్మక మౌనం పాటించడం గతంలో టీవీ5 యాంకర్ సినీ పరిశ్రమలోని ఆడవాళ్ళ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడే చూశాం.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆంధ్రజ్యోతి అధినేత పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయాలని ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటివన్నీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రజలలో ఈ వ్యాఖ్యల పట్ల ఎంతటి నిరసన వచ్చిందో తెలియజేయడానికి ఒక సూచికగా మాత్రం పనికి వస్తాయి.

ఏది ఏమైనా శ్రీకాకుళం ప్రజల మీద చౌకబారు వ్యాఖ్యలు చేసి వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఏబీఎన్ రాధాకృష్ణ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాడని ఆశిద్దాం.

– జురాన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close