ఆర్కే పలుకు : జగన్ చేతకాని తనమే కారణం..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోవడానికి.. తీసుకున్నా అమలు చేయలేకపోవడానికి కారణం… ముఖ్యమంత్రి జగన్ చేతకానితనమే కారణమని.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ .. తన వారాంతపు పొలిటికల్ కాలమ్ “కొత్తపలుకు”లో తేల్చేశారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా చెప్పలేదు కానీ.. మొత్తం వ్యాసంలో ప్రతి పదంలోనూ.. ఈ అంశాన్ని కనిపించేలా చేయగలిగారు. మూడు రాజధానుల దగ్గర్నుంచి.. ఇళ్ల స్థలాల పంపిణీ వరకూ.. అన్నీ న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయంటే.., దానికి కారణం… ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరూ కాదంటున్నారు.

తాను అమలు చేయలేని నిర్ణయాలు తీసుకోవడం… కోర్టులు చట్టాలు గుర్తు చేయడం… ఆ నిర్ణయాలను కొట్టి వేయడం.. జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబును నిందించడం.. కోర్టులపై దుష్ప్రచారం చేయడం.. ఈ సీరిస్ అంతా… రాజకీయం నడుస్తుంది కానీ.. ప్రజలకు మేలు చేసే ఆలోచనే జగన్‌కు లేదని.. నేరుగా చెప్పేశారు. ఇళ్ల పట్టాలు గతంలో అనేక ప్రభుత్వాలు ఇచ్చాయి. .. కానీ ఈ ప్రభుత్వం ఎందుకివ్వలేకపోతోంది..? అన్న సందేహాన్ని ఆర్కే చాలా బలంగా తీర్చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తే చెల్లవో.. అలా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. చెప్పేశారు. అదే సమయంలో.. ఆ పథకాన్ని అడ్డు పెట్టుకుని వందల కోట్లు అవినీతి చేసిన వైసీపీ నేతలు ఇప్పటికే బాగుపడిపోయారు. ఈ కోణాన్ని మాత్రం ఆర్కే విశ్లేషించలేకపోయారు.

చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నాడనే వైసీపీ నేతల ఆరోపణల్లో ఎంత హేతుబద్దత ఉందో… ఆర్కే వివరించారు. సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో సగం మందికిపైగా.. . ఏపీ ప్రభుత్వ పిటిషన్లను కొట్టి వేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు మాత్రమే కాదు.. ఏ కోర్టు అయినా… మెరిట్ లేకుండా… తీర్పులు ఇవ్వలేవని… గుర్తు చేశారు. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని తన కేసుల విచారణ జరగకుండా జగన్ ఎలా ఆలస్యం చేస్తున్నారో కూడా ఆర్కే వివరించారు. న్యాయవ్యవస్థపై ఇంతలా దాడి చేస్తున్న ఓ రాజకీయ పార్టీ ఇంత వరకూ లేదు. ఆ విషయాన్ని ఆర్కే పరోక్షంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు భిన్నమైన రాజకీయం నడుస్తోంది. ప్రజలకు మేలు చేస్తారో లేదో తెలియడం లేదు కానీ.. మేలు చేస్తున్నట్లుగా కనిపించి… దాన్ని విపక్షాలు.. కోర్టులు అడ్డుకుంటున్నాయన్న ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు నమ్ముతారో లేదో తెలియదు. కానీ ఇవాళ కాకపోతే.. రేపైనా.. నిజాలు నిలకడ మీద తెలుస్తాయంటున్నారు ఆర్కే. ఇప్పటికే వైసీపీ చేసిన ప్రచారంతో నమ్మి ఆ పార్టీకి ఓట్లేసిన వారికి.. పరిస్థితి అర్థమవుతోందన్న అభిప్రాయం.. ఆయన ఆర్టికల్‌లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close