ఆర్కే పలుకు : మళ్లీ టీడీపీ – బీజేపీ పొత్తు మాట..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీవారంతంలో తను రాసే ఆర్టికల్ ” కొత్తపలుకు”లో ఇటీవల గాఢత తగ్గింది. ఏపీ సర్కార్‌పై… తెలంగాణ సర్కార్‌పై గతంలో ఆయన విరుచుకుపడే తీరు వేరుగా ఉండేది. ఇప్పుడు ఆ తీరు మారిపోయింది. కేసీఆర్‌ తనకు కరోనా రావాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఓ కొత్తపలుకు మొత్తం కేటాయించి విమర్శలు చేసిన రాధాకృష్ణ ఆ తర్వాత సైలెంటయిపోయారు. అలాగే ఏపీ ప్రభుత్వం విషయంలోనూ.. గతంలో ఉన్నంత టెంపో.. తన ఆర్టికల్స్‌లో కనిపించనీయడం లేదు. కానీ… కొన్ని వారాల గ్యాప్ తర్వాత.. ఈ వారం…తనదైన స్టైల్‌లో ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. అవినీతి ఆరోపణల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ.. ఆయన తెలిసీ తెలియనట్లుగా.. మారబోతున్న రాజకీయం గురించి హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే తెలుగుదేశం పార్టీ – బీజేపీ పొత్తు.

వైసీపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు.. ఎంపీలు పలువురు.. పనులేమీ కావడం లేదని బయటపడుతున్నారు. దీంతో.. వైసీపీలో అసంతృప్తా.. అన్న చర్చ అంతటా ప్రారంభమయింది. దీన్ని వేమూరి రాధాకృష్ణ తనదైన శైలిలో విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ.. టీడీపీతో పొత్తు అలాగే తమకు సీటు గ్యారంటీ ఇస్తే.. పది మంది ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. వైసీపీలో ఎంపీలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది ఎడెనిమిది నెలల కిందటే బయటపడింది. కొత్త రాజకీయాలు ప్రారంభించి.. వైసీపీ కమాండ్ దయాదాక్షిణ్యాలతో ఎంపీలైన వారు కాకుండా.. సీనియర్ నేతలు.. రాజకీయంగా తాము ఎంపీలం అయినా.. కనీసం పలుకుబడి లేకుండా పోయిందని.. అసంతృప్తికి గురవుతున్నారు. నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదు. అందుకే వారిలో అసంతృప్తి ఉందని తరచూ బయటపడుతోంది. రఘురామకృ।ష్ణంరాజు దీనికి ఉతాహరణ. అయితే.. అంత మాత్రాన వారంతా బీజేపీలో చేరుతారా.. అంటే… చెప్పలేని పరిస్థితి. రెండు పరిణామాలపై హామీ ఇస్తే.. వారంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం ఆర్కే చెబుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయింది. ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అయితే.. ఎవరూ ఇప్పుడు తొందరపడే పరిస్థితి ఉండదు. కానీ.. ఇప్పటి నుండే ఆర్కే.. మానసికంగా సిద్ధం చేస్తున్నారని భావించవచ్చు. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో… అంచనా వేయగలిగిన సామర్థ్యం యాభై ఏళ్ల జర్నలిజం కెరీర్‌లో ఆయన సంపాదించుకుని ఉంటారు. పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులను రాధాకృష్ణ చూస్తూనే ఉంటారు. అందుకే పాత ఘటనలను ఉదహరించారు. 1983లో ఎన్‌.టి. రామారావు కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా.. రాజకీయ కారణాల వల్ల అసమ్మతి ఊపందుకుని ఎన్‌టీఆర్ కొంతకాలంపాటు అధికారం కోల్పోయారని గుర్తు చేశారు. ఎన్‌టీఆర్ హయాంలో అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహించినట్టుగా ఇప్పుడు వైసీపీలో అసంతృప్తిని భారతీయ జనతాపార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తున్నదనే అనుమానాన్ని ఆర్కే వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి కూడా లింక్ పెట్టారు ఆర్కే. జగన్‌తో విబేధాల గురించి ఆయన మాట్లాడిన మాటల్లో తేడా ఉందన్నారు.

ఈ రాజకీయ పరిస్థితులతో పాటు… ఏపీ సర్కార్ పెద్దలు కంటికి కనిపించని అవినీతి చేస్తున్నారనే వాదనను.. ఈ వారం ఆర్టికల్‌లో ఆర్కే ప్రస్తావించారు. అంటే.. గతంలో దొరికిపోయిన అనుభవాలతో ఈ సారి నల్లధనం మాత్రమే తీసుకుంటున్నారట.. ఏపీ ప్రభుత్వ పెద్దలు. దీనికి సంబంధించిన పలు పరిణామాల్ని ఆర్కే వివరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close