ఆర్కే పలుకు : జగన్‌పై మానసిక రోగి ముద్ర..!

ఆంధ్రజ్యోతి ఆర్కే తన “కొత్తపలుకు”లో ఎప్పుడూ ఓ కొత్త విషయం ఉండేలా చూసుకుంటారు. అది ఇతరులు నమ్ముతారా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. హై ప్రోఫైల్ మీడియా పర్సన్‌గా.. ఏ క్యాంప్‌లో ఏం జరుగుతుంతో తనకు తెలుస్తుందన్నట్లుగా ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా కొన్ని విషయాలు చెబుతూంటారు. వాటిని అటు స్వపక్షం కానీ..ఇటు విపక్షం కానీ ఖండించడం… నిజమేనని చెప్పడం లాంటివేమీ చేయలేరు. గత వారం రెండు వారాల కిందంట ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేసేందుకు చంద్రబాబు వద్దకు వచ్చారని.. కానీ రూ.350 కోట్లు వెచ్చించలేక వదులుకున్నారనిరాశారు. దానిపై పీకే టీం స్పందించలేదు.. చంద్రబాబుతో పాటు టీడీపీ కూడా స్పందించలేదు. అంటే… మౌనం అర్థాంగీకారం అనుకుని జనం నిజమేనని చర్చించుకోవడం ప్రారంభించారు. ఇలాంటివి ఆర్కే పలుకుల్లో చాలా ఉంటాయి. ఈ సారి ఆయన జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ మీటింగ్స్‌పై తన పలుకుల్లో ప్రస్తావించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రతీ రోజూ ఏసు ప్రభువుతో మాట్లాడుతూ ఉంటారు.. అలాగే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ మాట్లాడుతూ ఉంటారు… అని ఆర్కే చెబుతున్నారు. ఆయనకు ఎవరు చెప్పారంటే… స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలను ఎవరికైతే చెప్పారో… వారో వచ్చి ఆర్కేకు చెప్పారట. ఆర్కే ఎంత ఖచ్చితమైన విషయంగా దీన్ని చెప్పారంటే.. తేదీ కూడా చెప్పారు. గత ఏడాది మార్చి ఇరవై ఐదో తేదీన కరోనాపై సమీక్షలో అధికారులతో … తనకు ఏసు ప్రభువుతో మాట్లాడానని.. కరోనా లాంటిదేమీ లేదని..ఆయన చెప్పారని..అధికారులతో అన్నారట. ఆ అధికారుల్లో ఒకరు వచ్చి ఆర్కేకు చెప్పారట. ఆ తర్వాత వైసీపీలోచేరేందుకు వెళ్లిన మరో రిటైరైన సివిల్ సర్వీస్ అధికారులతో తాను రోజూ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడుతాననని చెప్పారట… ఆయన భయపడిపోయి.. మరోసారి ఆయన జోలికెళ్లలేదట. ఇందులో నిజం ఉందో లేదో కానీ.. ఆర్కే చెప్పిన విధానం చూసిన తర్వాత నమ్మని వారు ఎవరూ ఉండరు.

ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదే సమయంలో.. జగన్‌కు మానసిక రోగం ఉందని.. లండన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దానిపై విచారణ చేయాలని.. పిచ్చి ఉన్న వారికి పాలించే అర్హత లేదని ఆయన విమర్శలు చేస్తున్నారు. ఆ తర్వాతనే ఆయనపై కేసు.. ధర్డ్ డిగ్రీ లాంటివి అన్నీ వరుసగా జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిపై ప్రజల్లో చర్చ జరిగేలా చేయడానికి ఆర్కే తనకు తెలిసిన అధికారులు చెప్పిన విషయాలను ఉపయోగించుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఆర్కే కొత్తపలుకు ఒక్క రోజు ముందుగానే శనివారం రాత్రి ఎనిమిదిన్నరకు ఏబీఎన్‌ లో ప్రసారం చేస్తారు. అంతకు ముందే.. ఈ అంశంపై ప్రోమోలలోనూ ప్రాధాన్యత ఇవ్వడంతో అందరిలోనూ చర్చ ప్రారంభమైంది. సోషల్ మీడియాలోవిపరీతమైన ట్రోలింగ్స్ కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పిచ్చితనంతో తీసుకున్న నిర్ణయాలను హైలెట్ చేస్తూ.. ఇదిఅదేనా అని ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో.. ఆర్కే కోరుకున్న ఎఫెక్ట్ వస్తున్నట్లుగానే భావించాలేమో. ఇక్కడ ఇంకో విషయం ఏమింటటే.. ఈ అంశంపై విరుచుకుపడి వైసీపీ నేతలు పెద్దది చేసుకోలేరు.. అలాగని కామ్‌గా ఉండలేరు.

కొత్తపలుకులో ఆర్కే ఇతర విషయాలు చాలా వాటిని ప్రస్తావించారు. కీలకమైన రాజకీయ పరిణామాలనూ విశ్లేషించారు. కానీ అవన్నీ… ఏసు ప్రభువు, రాజశేఖర్‌రెడ్డితో జగన్ మాట్లాడటం అనే హైలెట్ సీన్ ముందు వెనుకబడిపోయాయి. అందుకే ఈ వారం.. ఆర్కే పలుకు వైరల్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close