ఆర్కే పలుకు : వైఎస్ సునీత, ఆమె భర్తపై కూడా స్కెచ్ !

” వైఎస్ వివేకానందరెడ్డిని చంపడమే కాదు ఆ కేసులో ఎవర్ని ఇరికించాలో కూడా ముందుగానే ప్లాన్ రెడీ చేశారు. తాము అధికారంలోకి రాగానే దాన్ని బలపరిచేందుకు కొన్ని వాంగ్మూలాలను కృత్రిమంగా పోలీసు అధికారులతో రెడీ చేయించారు. కానీ కేసు సీబీఐకి వెళ్లడంతోనే ప్లాన్ బెడిసికొట్టింది. లేకపోతే ఈ పాటికి వైఎస్ వివేకా హత్య కేసులో అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి జైల్లో ఉండేవారు” అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త కుట్ర కోణాన్ని తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు” లో ఆవిష్కరింప చేశారు. ప్రభుత్వ పెద్దల క్రిమినల్ మైండ్ ఎవరూ ఊహించలేనంతగా ఉంటుందని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించేప్రయత్నం చేశారు.

వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వతా రెండు సార్లు సిట్ బృందాలను మార్చారు. ఈ క్రమంలో వారు కొన్ని వాంగ్మూలాలు రెడీ చేశారు. వైఎస్ వివేకా హత్య గురించి బయటకు తెలియడానికి ముందే వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పులి వెందుల బయలుదేరి వచ్చేస్తున్నారని … అంటే.. వారికి హత్య జరుగుతుదంని ముందే తెలుసుని అనుకునేలా ఆ వాంగ్మూలాలు సిద్ధం చేసింది. ముందే తెలుసుంటే దానర్థం వారే చేయించారని పోలీసులు కేసు పెట్టడం తర్వాత పని. కానీ కేసు అక్కడి వరకూ వెళ్లకుండా సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో వివేకా కుమార్తె, అల్లుడు బయపడ్డారని ఆర్కే చెబుతున్నారు

వైఎస్ సునీత, ఆమె భర్తపైనే ఆరోపణలు చేస్తూ కొద్ది రోజులుగా నిందితులు, అనుమానితులు విస్తృతంగా లేఖలు రాయడం.. పిటిషన్లు వేయడం కూడా చేస్తున్నారు. వాటికి జగన్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసు అధికారులు ఆ వాంగ్మూలాలను క్రియేట్ చేశారంటే ముందు నుంచి అదే ప్లాన్‌లో ఉన్నారన్న అనుమానాలను ఆర్కే బయట పెట్టారు. ఆ వాంగ్మూలాల కథ.. అవి సృష్టించారు అనే విషయాన్ని సునీత భర్త ఇప్పటికే ఆధారాలతో సహా సీబీఐకి వివరించారు. తాను హత్య కేసు గురించి తెలిసేటప్పటికే తాను కర్నూలు రాలేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. ఒక వేళ కేసు సీబీఐ కి వెళ్లకపోతే ఈ కల్పిత వాంగ్మూలాల ద్వారా పోలీసులు నర్రెడ్డిని అరెస్ట్ చేసి ఉండేవారని.. ఆర్కే తన కథనంతో అందరూ ఊహించుకునేలా చేశారు.

వైఎస్ జగన్ ప్లాన్ తెలియక .. మొదట్లో సునీత తన అన్న రాజకీయంగా నష్టపోకూడదని ఆయన చెప్పమన్నదల్లా మీడియా ముందు చెప్పారు. కానీ చివరికి తమపైనే కుట్ర జరుగుతోందన్న విషయాన్ని ఆమె చాలా ఆలస్యంగా గుర్తించారు. అప్పటికైనా గుర్తించారు కాబట్టి బయటపడ్డారు కానీ.. లేకపోతే ఈ పాటికి జైలు పాలయ్యేవారన్నది ఆర్కే లాజిక్. తన కొత్తపలుకులో ఆమరావతి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. న్యాయం గెలిచిందని విశ్లేషించారు. ఈ అంశంపై ప్రభుత్వ కుట్రలపై ఆయన ఎన్నో సార్లు చెప్పిన విషయాలే మరోసారి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close