ఎబిఎన్ ఆర్కే కొత్తపలుకు: పవన్ పై జాలేస్తోంది

ఎబిఎన్ రాధాకృష్ణ “కొత్తపలుకు” శీర్షికన వ్రాస్తోన్న సంపాదకీయం లో “పాపం పవన్” అంటూ సుదీర్ఘమైన విశ్లేషణ వ్రాసుకొచ్చారు. శ్రీరెడ్డి విషయమ లో పవన్ స్పందించిన తీరుని, మీడియాపై ఆయన పోరాటాన్ని, ఇందులోని రాజకీయ వ్యూహాన్ని ఆయన స్పృశించారు. క్లుప్తంగా ఆ వివరాలు

శ్రీరెడ్డి విషయం లో పవన్ స్పందించిన తీరు పై :

  • శ్రీరెడ్డి తిట్టిన తిట్టుకు అర్థం కూడా తెలుసుకోకుండా పవన్‌ కల్యాణ్‌ యాగీ చేస్తున్నాడు.
  • శ్రీరెడ్డి తిట్టింది పవన్‌కల్యాణ్‌నే గానీ, ఆయన మాతృమూర్తిని కాదు. ఒక వ్యక్తి క్యారెక్టర్‌ గురించి వర్ణించడా నికి శ్రీరెడ్డి వాడిన పదాన్ని ఉపయోగిస్తారు తప్ప అందులో తల్లులను నిందించడం ఉండదు. ఈ మాత్రం కూడా పవన్‌ కల్యాణ్‌కు తెలియదా.
  • సమస్యలు ఉంటే పోలీసు స్టేషన్‌నో, న్యాయస్థానాన్నో ఆశ్రయించాలని శ్రీరెడ్డికి సూచించిన ఆయన ఇప్పుడు చేసింది ఏమిటి?
  • పవన్‌ కల్యాణ్‌ అనుమానించదలచుకుంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని, ఆ పార్టీ వాళ్లను అనుమానించాలే గానీ మీడియా సంస్థల అధిపతులపై నిందలు వేయడం ఏమిటి?
  • శ్రీరెడ్డి వ్యవహారంలో ఆయన ఫక్తు రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు

మీడియాపై ఆయన పోరాటం పై :

  • జనసేన అధినేతగా పవన్‌ కల్యాణ్‌ కార్యక్రమాలకు విశేష ప్రచారం కల్పించిన మీడియా సంస్థలు ఇప్పుడు ఆయనకు చేదుగా మారాయి.
  • మొన్నటివరకు పవన్‌ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన శ్రీమతి రోజా , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు తీయగా మారడం వెనుక మర్మం ఏమిటో
  • పవన్‌ కల్యాణ్‌ను ఈమధ్య పీడకలలు బాధిస్తున్నట్టున్నాయి. అందుకే తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయనీ నాపైనా, సాటి మీడియా సంస్థ అధినేత శ్రీనిరాజుపైనా ఆగ్రహం వచ్చింది
    రెచ్చిపోవడానికి అభిమానులు ఉన్నారన్న అహంకారంతో మీడియాపై దాడులు చేయించడం బలవంతుల లక్షణం కాదు.
  • “రాజకీయ నాయకులకు జర్నలిస్టుల అవసరం ఉంటుంది. జర్నలిస్టులు లేకపోతే మీకు ఉనికే ఉండదు’’ అని కెమేరామెన్‌ గంగతో రాంబాబు సినిమాలో పవన్‌కల్యాణ్‌కు ఒక డైలాగ్‌ ఉంది.
    అకారణంగా నన్ను, మా మీడియా సంస్థలను నిందించిన పవన్‌ కల్యాణ్‌పై నేను న్యాయ పోరాటం చేయబోతున్నాను.

భవిష్యత్ రాజకీయ పరిణామాలపై:

  • ప్రత్యేకహోదా విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పవన్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తేలవలసి ఉంది.
  • ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పవన్‌ కల్యాణ్‌ చేతులు కలపడానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • అభిమానులను రెచ్చగొట్టే ధోరణిలో పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు ఉన్నాయంటే ఆయన ఏదో వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారనుకోవలసి వస్తుంది.

చివరగా:

  • రాజకీయ నాయకుడు మొదటగా అలవర్చుకోవలసింది సహనాన్ని!
  • చీటికీ మాటికీ మీడియా సంస్థలను నిషేధించాలని పిలుపు ఇవ్వడం ఫ్యాషన్‌గా మారింది. పవన్‌ కల్యాణ్‌ ఇంకా అధికారంలోకి రాకుండానే నిషేధాజ్ఞలు విధిస్తున్నారు.
  • పవన్‌కల్యాణ్‌! మీ కుట్ర థియరీ అంతా పీడకలే

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.