దుర్గగుడిలో ఏసీబీ..! వెల్లంపల్లిని టార్గెట్ చేశారా..!?

విజయవాడ దుర్గ గుడిలో ఏసీబీ అధికారులు సుదీర్ఘసోదాలు జరిపారు. అన్ని డిపార్టుమెంట్లలోనూ అవినీతి జరిగిందన్నట్లుగా ఏసీబీ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఈ సోదాలన్నీ మంత్రి వెల్లంపల్లిని టార్గెట్ చేసి చేశారన్న చర్చ విజయవాడ వైసీపీలో జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రాగానే వెల్లంపల్లి .. దేవాదాయ మంత్రి అయ్యారు. వెంటనే… ఈవోగా నియండానికి అవసరమైన స్థాయి క్యాడర్ కాకపోయినా సురేష్ అనే అధికారిని తెచ్చి ఈవోని చేశారు. అప్పట్నుంచి వెల్లంపల్లి ఏది చెబితే అదిచేయడమే సురేష్ పనిగాచెబుతూంటారు. ఈ కారణంగా గుడి మొత్తాన్ని వెల్లంపల్లి అధీనంలోకి తీసుకుని… పనులు చక్క బెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

దుర్గగుడిలో అనేక వివాదాలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి రథం సింహాలు పోయినా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. చివరికి ఎవరినో పట్టుకుని వెండి కరిగించేశారని.. కొంత వెండిని రికవరీ చూపించి.. చేధించామని పోలీసులు ప్రకటించారు. దాన్ని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితిఏర్పడింది. వాటి కంటే ముఖ్యంగా.. ఆలయంలోని ప్రతీ విభాగంలోనూ కమిషన్ల ప్రక్రియ నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి వెల్లంపల్లికి దుర్గగుడిలో కొబ్బరికాయలు సేకరించే కాంట్రాక్ట్ ఉంది. అమ్మవారి ప్రసాదాల తయారీ, చీరల కౌంటర్లు, ప్రొవిజన్స్ స్టోర్, చీరల స్టోర్, డొనేషన్ కౌంటర్ ఇలా ప్రతీ విభాగంలోనూ రేట్లు ఫిక్సయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి.

అవినీతి అంతా బహిరంగ రహస్యమే. చాలా కాలంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా కార్పొరేషన్ ఎన్నికల వేళ… ఏసీబీ అధికారులు రెయిడ్ చేశారు. సుదీర్ఘంగా సోదాలు చేస్తున్నారు. అయితే.. ఇదంతా అవినీతిపై పోరాడుతున్నాం అనిచిత్రీకరించుకునే వ్యూహంలోభాగమనేనని.. అయితే అవినీతిలేదని పక్కన పెట్టేయడమో లేకపోతే… అసలు పట్టించుకోకపోవడమోచేస్తారని కొంత మంది ఊహిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. వైసీపీలో మాత్రం.. మంత్రి వెల్లంపల్లికి గడ్డు పరిస్థితులు ప్రారంభమయ్యాయన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close