పవన్ కల్యాణ్ పోరాటయాత్రకు ఇంకెంత కాలం విరామం..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం యాత్ర చేస్తానని.. మూడు నెలల కిందట ఇచ్చాపురం నుంచి పోరాటయాత్ర ప్రారభించారు. కానీ ఇప్పటికి.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు మాత్రమే పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. యాభై రోజుల షెడ్యూల్‌లో.. ఉత్తరాంధ్రను కంప్లీట్ చేశారు కానీ.. వాస్తవంగా.. ఆయన నియోజకవర్గాల్లో పోరాటాలు చేసింది.. పదిహేను రోజులు మాత్రమే. రోజుకు.. రెండు నియోజకవర్గాలు.. ఒక్కో రోజు మూడు నియోజకవర్గాలు కంప్లీట్ చేశారు. మధ్యలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, జ్వరాలు పండుగులతో కాలం గడిచిపోయింది. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభించారు. అక్కడ రెండు సార్లు అర్థంతరంగా ముగిసింది. ఇప్పటికి రెండు వారాలు అయినా.. తదుపరి యాత్ర మళ్లీ ఎప్పటి నుండో.. జనసేన అత్యున్నత వర్గాలకూ కూడా అర్థం కావడం లేదు.

పవన్ కల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స జరిగింది. ఐదారు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహాలిచ్చారు. ఆ సమయం కూడా ముగిసింది. చిరంజీవి పుట్టిన రోజుకు కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు కూడా చెప్పి వచ్చారు. దాంతో జనసేనాధినేత..నుంచి పోరాటయాత్ర ప్రకటన వస్తుందని.. కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల వాతావరణం ఇప్పటికే ఊపందుకుంది. వచ్చే ఏప్రిల్‌, మేలో ఎన్నికలు జగనున్నాయి. గట్టిగా చూస్తే.. ఏడెనిమిది నెలలు కూడా లేవు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ వేగాన్ని బట్టి చూస్తే.. మూడు నెలలకు మూడు జిల్లాలు మాత్రమే కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా పది జిల్లాలు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసే సరికి ఎన్నికలు ముంచుకొచ్చేస్తాయి.

మరో వైపు తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు వచ్చేసింది. కేసీఆర్ అధికారిక ప్రకటన చేయడమే మిగిలింది. ఇప్పుడు తెలంగాణపైనా దృష్టి పెడతానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. కానీ ఇంత వరకూ సంస్థాగతంగా ఒక్క కీలకమైన నిర్ణయమూ తీసుకోలేదు. ఏపీ సంగతి తర్వాత.. ముందుగా.. తెలంగాణలో ఎన్నికలొస్తున్నాయి కాబట్టి.. పొత్తుల గురించి చర్చించుకుందామని.. కమ్యూనిస్టులు లేఖ రాశారు. అంటే.. వారికి నేరుగా కలిసే అవకాశం కూడా దక్కడం లేదు. ఈ లేఖ విషయం మీడియాలో వచ్చేసరికి.. జనసేన కీలక నేతలు ఓ సమావేశం జరిపి.. త్వరలోచర్చలని ప్రకటించారు. త్వరలో అంటే ఎప్పుడు.. పవన్ కల్యాణ్.. పేస్ ప్రకారం చూస్తే.. అవి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కావొచ్చున్న సందేహం..కమ్యూనిస్టుల్లో ఉంది. ఎన్నికలు ముందున్న తెలంగాణ విషయంలోనే ఇలా వ్యవహరిస్తే.., ఎప్పుడో ఎనిమిది నెలల తర్వాత కదా.. ఏపీలో ఎన్నికలు వచ్చేది అని పవన్ భావిస్తే.. మొత్తానికే.. తేడా కొట్టేస్తుందని.. జనసేన ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close