పూరి ప‌ని మొద‌లెట్టాడు

హిట్టొచ్చినా, ఫ్లాపులిచ్చినా పూరి చేతిలో బోల్డంత ప‌ని. ఆయ‌న ఖాళీగా కూర్చున్న సంద‌ర్భం ఒక్క‌టంటే ఒక్క‌టీ క‌నిపించ‌దు. పైసా వ‌సూల్ త‌ర‌వాత త‌నయుడు ఆకాష్ పూరిని హీరోగా తీర్చిదిద్దే ప‌నుల్లో ప‌డిపోయారు. ఆకాష్ పూరి క‌థానాయ‌కుడిగా పూరి ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణో అకాడ‌మీ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. క‌థానాయిక‌గా నేహా శెట్టిని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్తారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ని గురువారం ఉద‌యం 9.30 నిమిషాల‌కు అధికారికంగా ప్ర‌కటిస్తారు. అక్టోబ‌రు నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లుకాబోతోంది. ఇదో స్వీట్ ల‌వ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, ఈడియ‌ట్ త‌ర‌వాత‌.. పూరి ప్యూర్ ల‌వ్ స్టోరీని ట‌చ్ చేయ‌లేదు. ఈసారి ల‌వ్ లో ఏ యాంగిల్‌ని బ‌య‌ట‌కు తీస్తాడో చూడాలి.

* రామ్ చ‌ర‌ణ్‌తో రూమ‌రేనా?

నంద‌మూరి బాల‌కృష్ణ 103వ చిత్రం పూరితోనే అన్న‌ది టాక్‌. పైసా వ‌సూల్ త‌ర‌వాత కూడా బాల‌య్య పూరికి అవ‌కాశం ఇస్తాడా అనేది అనుమానంగా మారింది. మ‌హేష్‌, వెంక‌టేష్‌, ఎన్టీఆర్‌.. ఇలా పూరితో సినిమా కోసం చాలామంది అగ్ర క‌థానాయ‌కుల పేర్లు వినిపించాయి. బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ని పూరి చేతుల్లోనే పెట్టిన‌ట్టు గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఈ లిస్టులో చ‌ర‌ణ్ పేరు చేరింది. రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ పూరి చేతుల మీదుగానే అయ్యింది. ఆ సినిమా విడుద‌లై ప‌దేళ్లు కావొస్తుంది. ఈసంద‌ర్భంగా చ‌ర‌ణ్‌తో పూరి మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. రంగ‌స్థ‌లం త‌ర‌వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు చ‌ర‌ణ్‌. రాజ‌మౌళితోనూ ఓ సినిమా చేసే అవ‌కాశాలున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఈనేప‌థ్యంలో చ‌ర‌ణ్ పూరికి అవ‌కాశం ఇవ్వ‌డం అనుమాన‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.