” అగ్రిగోల్డ్ ” బాధితులూ ” అన్న హామీ “ని గుర్తు చేస్తున్నారు. !

పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయక జగన్ నిండా మునిగిపోతున్నారు. హామీలు పొందిన వారు ఎదురు చూసి రోడ్డెక్కుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి బడ్జెట్‌లోనే అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయిస్తా. డిపాజిటర్లందరికీ న్యాయం చేస్తానని జగన్ పాదయాత్రలో ప్రతీ చోటా చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చారు. బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు పెట్టారు. కానీ రూపాయి ఇవ్వలేదు. ఆ బడ్జెట్ మురిగిపోయింది. తర్వాత బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు.

ఇప్పటికీ.. ఒక్కటంటే.. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. అగ్రిగోల్డ్ బాధితులు.. తమ డబ్బులు వస్తాయేమోనని ఆశగా ఎదురు చూడటం.. నిరాశతో వెనుదిరగడం… కామన్ అయిపోయింది. అయితే గత ప్రభుత్వం కేటాయించిన రూ. 250 కోట్లు… వేలం ద్వారా వచ్చిన మరో రూ. 50కోట్లు కలిపి… మూడు వందల కోట్లను.. అగ్రిగోల్డ్ బాధితులకు పంచేందుకు.. విడుదల చేశారు. . రూ. పదివేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించారు. ఇంకెవరికీ చెల్లించలేదు. టీడీపీ హయాంలో అగ్రిగోల్డ్ స్కాం బయటపడింది అప్పట్లో బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆత్మహత్యలు చేయించుకున్నవారికి పరిహారం ఇచ్చారు. బాధితులు లక్షల్లో ఉండటంతో.. అప్పటి చంద్రబాబు సర్కార్ కూడా.. ఇవ్వడానికి అంగీకరించింది. రూ. 200 కోట్లు అప్పటికి రిలీజ్ చేసింది వాటిని రూ. 10వేల లోపు డిపాజిటర్లకు అందజేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ లోపే సర్కార్ మారింది. జగన్ వచ్చారు. పరిస్థితి తిరగబడింది.

ప్రభుత్వంలో ఈ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా… సీఎం జగన్ ఒకటే మాట చెబుతూంటారు. ఇప్పుడే.. ఆర్థిక శాఖ కార్యదర్శికి.. ఆదేశాలిచ్చాను.. అగ్రిగోల్డ్ కు.. కేటాయించిన రూ. 1150 కోట్లు విడుదల చేయమని చెప్పాను.. అని .. ఈ ముక్కను .. ప్రభుత్వ పీర్వోలు వెల్లడిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి విడుదల కాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కుతున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన భారీ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close