4 రేటింగ్‌ సినిమాలు తియ్యడం మనవాళ్ళ వల్ల కాదా?

మనం సినిమాని సినిమాలాగే చూస్తాం. మన సినిమాల్లో చూపించిన సంఘటనలుగానీ, కనిపించే క్యారెక్టర్లుగానీ నిజ జీవితంలో మనకు తారస పడరు అనేలా ఆయా క్యారెక్టర్లు వుంటాయి. ఇక మన హీరో చేసే విన్యాసాలు చూస్తే భూ ప్రపంచంలోనే ఇలాంటి వాడు వుండడు అనేలా వుంటాయి. మన డైరెక్టర్లు ఇలా సినిమాలు తియ్యడం వెనుక రీజన్‌ ఏమై వుంటుంది. ప్రేక్షకులు సినిమాలు అలా వుండాలి అని కోరుకుంటున్నారా? అలాంటి సినిమాలైతేనే మేం చూస్తాం అని వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? సహజత్వానికి దూరంగా వున్న సినిమాల్ని హిట్‌ చేసినట్టుగానే నేచురల్‌గా వుండే సినిమాల్ని, యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాల్ని కూడా మనవాళ్ళు ఆదరిస్తున్నారు. మరి అలాంటప్పుడు మన దర్శకనిర్మాతలు ఆ ‘భ్రమ’లో నుంచి బయటికి వచ్చి అందర్నీ ఆలోచింపజేసే సినిమాల్ని తీసి తెలుగు సినిమా స్టామినా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పొచ్చు కదా. విజువల్‌గానో లేదా బడ్జెట్‌ పరంగానో భారీగా సినిమాలు తీసి దానికి మార్కెటింగ్‌ అనే ట్రిక్‌ని ప్లే చేసి సినిమాని పెద్ద హిట్‌ చెయ్యడం ద్వారా ఏ డైరెక్టరూ గొప్పవాడు అనిపంచుకోలేడు. యదార్థ సంఘటనల్ని అంతే సహజంగా తెరకెక్కించడం ద్వారా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలడు.

అలాంటి యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఓ బాలీవుడ్‌ చిత్రం ఇప్పుడు యావత్‌ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. అక్షయ్‌కుమార్‌ హీరోగా మలయాళ డైరెక్టర్‌ రాజాకృష్ణ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఎయిర్‌ లిఫ్ట్‌’ జనవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై టాక్‌ పరంగా, కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. యదార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అన్నివర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా సినీ విశ్లేషకులు ఈ చిత్రానికి 4 ఔట్‌ ఆఫ్‌ 5 ఇచ్చి ఈ చిత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

1990లో కువైట్‌లోని ఆయిల్‌ బావుల కోసం ఆ దేశంపై నిర్దాక్షణ్యంగా దాడులు చేసింది ఇరాక్‌ ప్రభుత్వం. అంతటితో ఆగకుండా అక్కడి కువైటీలపై కూడా దాడి చేసింది. ఆ ఘటనలో లక్షా 70 వేల మంది భారతీయులు కూడా చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా ఇండియాకు ఎలా తీసుకొచ్చారు అనేది ఈ సినిమా కథ. వాస్తవిక సంఘటనను కళ్లకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్‌ అవ్వడమే కాదు.. సినిమాలోని ఎమోషన్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేసాడు దర్శకుడు రాజాకృష్ణ. ఈ మిషన్‌లో కువైట్‌లోని ఇద్దరు ఇండియన్‌ బిజినెస్‌మెన్‌ కీలకపాత్ర పోషించారు. అయితే దాన్ని సినిమా కోసం మార్చి అక్షయ్‌కుమార్‌ని బిజినెస్‌మేన్‌గా చూపించారు.

ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఒక డౌట్‌ మాత్రం డెఫినెట్‌గా వస్తుంది. అదేమిటంటే తెలుగులో ఇలాంటి సినిమాలు తియ్యడానికి ఏ డైరెక్టరూ, ఏ ప్రొడ్యూసరూ ముందుకు రారు ఎందుకు అని? పాత సినిమాల సంగతి పక్కన పెడితే దాదాపు 30 సంవత్సరాలుగా చూసిన సినిమాలనే అటు తిప్పి, ఇటు తిప్పి.. కాస్త టెక్నాలజీ జోడించి మళ్ళీ ఆ సినిమాలనే మన మొహాన కొడుతున్నారు మన డైరెక్టర్లు. ‘ఇలాంటి కథాంశంతో ఇంతవరకు సినిమా రాలేదు’ అని ఓ స్టేట్‌మెంట్‌ పడేసే మన డైరెక్టర్లకు ‘మేం చూసిన సినిమానే మళ్లీ చూపిస్తున్నావు’ అని చెప్పే వారెవరు? అన్ని తెలుగు సినిమాల కాన్సెప్ట్‌లూ ఒక్కటే… టైటిల్సే వేరు. హీరో బలవంతుడు. ఎంత బలవంతుడంటే ఎంతమంది ఎదురొచ్చినా పిట్టల్లా గాల్లో ఎగిరిపోయేలా కొట్టగలడు. ఎంతటి తెలివైన వాడినైనా తన తెలివి తేటల్తో మాయ చెయ్యగలడు. ఆ హీరో మన కళ్ళకు ఎలా కనిపించినా హీరోయిన్‌కి మాత్రం మన్మథుడులాగే కనిపిస్తాడు. ప్రపంచంలోనే ఇంత అందగాడు లేడు అనుకుంటుంది. సినిమాలోని ప్రతి సంఘటన హీరోకి అనుకూలంగానే జరుగుతుంటుంది. క్లైమాక్స్‌లో విజయం సాధించేది హీరోనే అన్న విషయం ఆడియన్స్‌కి ముందే తెలుసు. కానీ, ఏం చేస్తారు మన సినిమాల స్టాండర్డ్‌ ఇంతే అని సరిపెట్టుకొని చూస్తారు. 90 పర్సెంట్‌ మన సినిమాలు ఇలాగే వుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే మంచి సినిమాలు వస్తుంటాయి.

తెలుగులో అద్భుతమైన సినిమాలు తీశాం, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాం అని చెప్పుకునే ఆ దర్శకులు ‘ఎయిర్‌లిఫ్ట్‌’ని చూసి ఏం సమాధానం చెప్తారు? ఈ చిత్రానికి యునానిమస్‌గా 4 రేటింగ్‌ ఇచ్చాయి టాప్‌మోస్ట్‌ వెబ్‌సైట్స్‌. ఇలాంటి సినిమా చూసిన తర్వాతయినా మన డైరెక్టర్లు బుద్ధి తెచ్చుకొని ప్రేక్షకులు మెచ్చే సినిమాలు, వాళ్ళకు నచ్చే సినిమాలు తీసి ‘నిజమైన’ క్రియేటర్లు అనిపించుకుంటే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close