ఇది విన్నారా.. ట్రాయ్ సినిమా అవకాశాన్ని జారవిడిచిన ఐశ్వర్య రాయ్..!

హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ట్రాయ్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిన పనిలేదు. అంతటి అద్భుత సినిమాలో అవకాశం వచ్చినా తాను చేయలేను అని తప్పుకుందట ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. 2004లో వచ్చిన ఆ సినిమాలో డయాన్ క్రూజన్ నటించిన పాత్రలో ముందు ఐశ్వర్యనే అడిగారట ట్రాయ్ దర్శకుడు వోల్గ్యాంగ్ పీటర్సన్. అయితే ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పిన ఐశ్వర్య దాని కోసం నగ్నంగా నటించాల్సి ఉంటుందని చెప్పాడట.

హాలీవుడ్ సినిమాల్లో నగ్నంగా నటించడం తప్పేం లేదు కాని భారతీయ మహిళగా తాను ఆ పని చేయలేనని చెప్పి తప్పుకుందట. బ్రాడ్ ఫిట్ సరసన నటించే అదృష్టాన్ని జారవిడిచుకుందట ఐశ్వర్య. అయితే ఇప్పుడేదో హాలీవుడ్ సీరియల్స్ లో, సినిమాల్లో అవకాశం రాగానే రెచ్చిపోతున్న బాలీవుడ్ భామలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఐశ్వర్య రాయ్ కాబట్టి ఆ ఆఫర్ ను రిజక్ట్ చేసింది కాని ఇప్పుడున్న నటీమణులు ఎవరైనా తప్పకుండా చేసే ఆస్కారం ఉందని బాలీవుడ్ మీడియా చురకలు వేస్తూ హడావిడి చేస్తుంది.

రీసెంట్ గా ఓ పబ్లిక్ మీట్ లో ట్రాయ్ సినిమా విషయాన్ని ప్రస్థావించింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. సో భారతదేశ సంప్రదాయాలను పాటించింది కనుకనే ట్రాయ్ ఆఫర్ను రిజక్ట్ చేసింది ఐశ్వర్య. ఒకవేళ అదే సినిమా ఐశ్వర్య చేసుకుంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో మరి. ప్రపంచ సుందరి అయినా సరే విలువలకు ప్రాణం ఇస్తున్న ఐశ్వర్యకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close