త్రిష పోయే… ఐశ్వర్య వచ్చే!

త్రిషకు కోపం వచ్చింది. అదీ సగం సినిమా చిత్రీకరించిన తరవాత. ఆమె కోపానికి కారణం ఏంటంటే… తన క్యారెక్టర్ కంటే జూనియర్ అయిన కీర్తీ సురేష్ క్యారెక్ట‌ర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్, లెంగ్త్ ఇస్తున్నారని! కోపంతో సినిమా నుంచి తప్పుకుంది. ఇదంతా తమిళ సినిమా ‘సామి స్క్వేర్’ గొడవ. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ‘అపరిచితుడు’ విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. పదిహేనేళ్ల క్రితం ఇదే హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో వచ్చిన ‘సామి’కి సీక్వెల్. అందులో త్రిష హీరోయిన్. సీక్వెల్‌లోనూ ఆమె క్యారెక్టర్ వుంది. అయితే… ఆమెతో పాటు మరో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ని సినిమాలోకి తీసుకున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ జరిగాక… త్రిష సినిమా నుంచి తప్పుకుంది. దర్శక నిర్మాతలను ఆమెకు నచ్చజెప్పాలని చూశారు. వినలేదు.

ఇప్పుడు త్రిష స్థానంలో ఐశ్వర్యా రాజేష్‌ని తీసుకున్నారు. ఆల్రెడీ ఆమె మీద కొన్ని రోజులు షూటింగ్ చేశారు. మరో పదిహేను రోజులు షూటింగ్ చేస్తే ఐశ్వర్యా రాజేష్ పార్ట్ పూర్తవుతుంది. విక్ర‌మ్‌తో ఐశ్వ‌ర్యా రాజేష్‌కి రెండో సినిమా ఇది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ధ్రువ నక్షత్రం’లో కీలక పాత్ర చేసిందామె. అది విడుదల కాకముందే ఆమెకు మరో అవకాశం ఇచ్చాడు విక్రమ్. మణిరత్నం ‘నవాబ్’లోనూ ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. ‘సామి స్క్వేర్’ నుంచి తప్పుకున్నందుకు త్రిషపై నిర్మాతలు ఆగ్రహంతో వున్నారని చెన్నై సమాచారం. నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేస్తే త్రిష పెద్ద మొత్తంలో ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇటీవల ఇటువంటి తగాదాలు తమిళ సినిమా ఇండస్ట్రీలో రెండుమూడు జరిగాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close